సిద్ధు జొన్నలగడ్డ.. మరో క్రేజీ కాంబో!
‘డీజే టిల్లు’ తర్వాత సిద్ధు జొన్నలగడ్డ తన కెరీర్‌ను కొత్త లెవెల్ కు తీసుకెళ్లేందుకు జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు.
‘డీజే టిల్లు’ తర్వాత సిద్ధు జొన్నలగడ్డ తన కెరీర్‌ను కొత్త లెవెల్ కు తీసుకెళ్లేందుకు జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. ఆయనకు ‘టిల్లు స్క్వేర్’ తర్వాత అనేక రకాల ఆఫర్స్ అయితే వచ్చాయి. కానీ ఎంతో డిఫరెంట్ గా ఉంటేగాని ఇప్పుడు అతను ఓకే చేయడం లేదు. సక్సెస్ తో కెరీర్ ను ఒక సరైన ట్రాక్ లోకి తీసుకు రావాలని అనుకుంటున్నాడు. ఇటీవల వచ్చిన కొన్ని కథలు నచ్చకపోవడంతో, పూర్తి ఫోకస్ ప్రస్తుత ప్రాజెక్ట్‌పైనే పెట్టాడు.
రెండో టిల్లు అనంతరం కొద్దిపాటి గ్యాప్ తీసుకున్న సిద్దు, 'జాక్', 'తెలుసు కదా' చిత్రాలను ఒప్పుకున్నాడు. ప్రస్తుతం ఇవి ప్రొడక్షన్ దశలో ఉన్నాయి.
తాజాగా, సిద్ధు కొత్త ప్రాజెక్ట్‌ను ఓకే చేసినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌కి 'తొలి ప్రేమ'తో డైరెక్టర్‌గా మంచి పేరు తెచ్చుకున్న వెంకీ అట్లూరి దర్శకత్వం వహించనున్నాడు. గతేడాది ‘సార్’తో ఆకట్టుకున్న వెంకీ ప్రస్తుతం దుల్కర్ సల్మాన్‌తో ‘లక్కీ భాస్కర్’ చిత్రాన్ని చేస్తున్నారు.
ఈ సినిమా పూర్తయ్యాక, సిద్ధుతో కలిసి వర్క్ చేయబోతున్నట్లు సమాచారం. ఇటీవల వెంకీ అట్లూరి సిద్ధుకి ఫైనల్ కథ చెప్పగా సిద్ధు ఓకే చేసినట్లు తెలిసింది. ఈ కొత్త ప్రాజెక్ట్ కూడా సితార ఎంటర్టైన్మెంట్స్ బేనర్‌పై తెరకెక్కనుంది. సిద్ధు వరుసగా ‘డీజే టిల్లు’, ‘టిల్లు స్క్వేర్’ చిత్రాలు చేసిన సంస్థ ఇది. ఇదే బేనర్లో వెంకీ అట్లూరి కూడా ‘రంగ్ దే’, ‘సార్’, ‘లక్కీ భాస్కర్’ చిత్రాలు చేశారు.
ఇద్దరికీ ఈ నిర్మాణ సంస్థతో మంచి అనుబంధం ఉంది. ఈ కారణంగా, సిద్ధు మరియు వెంకీ కలిసి కొత్త సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు. సిద్ధు జొన్నలగడ్డ ఫాలోవర్స్ ఈ కొత్త ప్రాజెక్ట్ గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇంతవరకు చేసిన సినిమాలు యువతలో ఆయనకు మంచి క్రేజ్ తెచ్చిపెట్టాయి. వెంకీ అట్లూరితో కలిసి పనిచేయడం ద్వారా, ఈ ప్రాజెక్ట్ కూడా మంచి విజయాన్ని అందిస్తుందని ఆశిస్తున్నారు.
‘టిల్లు స్క్వేర్’ తర్వాత సిద్ధు తీసుకున్న నిర్ణయం, తదుపరి ప్రాజెక్ట్‌లు ఏ విధంగా ఉంటాయో చూడాలి. కాగా, ‘తెలుసు కదా’, ‘జాక్’ చిత్రాలను త్వరలోనే పూర్తి చేయనున్నాడు. ప్రేక్షకులు కూడా ఈ కొత్త కాంబినేషన్‌పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్స్ చూస్తుంటే, సిద్ధు జొన్నలగడ్డ తన కెరీర్లో మరో ముఖ్యమైన అడుగు వేస్తున్నట్లు కనిపిస్తోంది. మరి ఈ కొత్త ప్రాజెక్ట్‌లతో ఆయన ఎలా ఆకట్టుకుంటారో చూడాలి.