సైమా సెకండ్ డే.. ఉత్తమ చిత్రం జైలర్.. ఉత్తమ నటుడు విక్రమ్

సైమా (సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్) 2024 వేడుక దుబాయ్ వేదికగా జరగటం తెలిసిందే.

Update: 2024-09-16 04:14 GMT

సైమా (సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్) 2024 వేడుక దుబాయ్ వేదికగా జరగటం తెలిసిందే. మొదటి రోజున తెలుగు.. కన్నడ చిత్ర రంగానికి చెందిన ప్రముఖులు హాజరు కావటం.. ఆయా చిత్రాలకు సంబంధించిన అవార్డులను ప్రకటించటం తెలిసిందే. రెండో రోజైన ఆదివారం తమిళ.. మలయాళ చిత్రాలకు సంబంధించిన అవార్డులను ప్రదానం చేశారు.

2023లో ఉత్తమ ప్రదర్శన కనబర్చిన చిత్రాలకు.. వాటికి పని చేసిన నటీనటులకు.. సాంకేతిక నిపుణులకు అవార్డులు దక్కాయి. మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన భారీ చిత్రం పొన్నియిన్ సెల్వన్ 2లో నటనకు విక్రమ్ కు ఉత్తమ నటుడి అవార్డు లభిస్తే.. తమిళంతో పాటు.. తెలుగులోనూ సూపర్ హిట్ అయిన రజనీకాంత్ ‘జైలర్’ మూవీ ఉత్తమ చిత్రంగా నిలిచింది. మలయాళం చిత్ర రంగానికి సంబంధించి చూస్తే.. సంచలన విజయాన్ని సాధించిన రియల్ విషాద ఉదంతాన్ని తెరకెక్కించిన ‘2018’ మూవీలో అదిరే నటనకు టొవినో థామస్ ను ఉత్తమ నటుడిగా.. మమ్ముట్టి నటించిన నన్పకల్ నేరతు మయక్కం మూవీని ఉత్తమ చిత్రంగా ఎంపిక చేశారు.

సైమా 2024 (తమిళ) అవార్డులు పొందిన వారు వీరే..

ఉత్తమ నటుడు విక్రమ్ (పొన్నియిన్ సెల్వన్ 2)

ఉత్తమ నటి నయనతార (అన్నపూరణి)

ఉత్తమ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ (జైలర్)

ఉత్తమ చిత్రం జైలర్

ఉత్తమ సహాయ నటుడు వసంత్ రవి (జైలర్)

ఉత్తమ సహాయ నటి సరిత ఈశ్వరి (మావీరన్)

ఉత్తమ విలన్ అర్జున్ (లియో)

ఉత్తమ కమెడియన్ యోగిబాబు (జైలర్)

ఉత్తమ పరిచయ నటి ప్రీతి అస్రాని (అయోథి)

ఉత్తమ పరిచయ నటుడు హ్రదు హరూన్ (థగ్స్)

ఉత్తమ సినిమాటోగ్రఫీ తేనీశ్వర్ (మామన్నన్)

ఉత్తమ లిరిస్ట్ విష్నేశ్ శివన్ (రథమారే - జైలర్)

ఉత్తమ గాయకుడు సీన్ రోల్టన్ (నాన్ గాలి - గుడ్ నైట్)

ఉత్తమ నేపథ్య గాయని శ్రీశక్తి గోపాలన్ (హాయ్ నాన్న)

ఉత్తమ పరిచయ దర్శకుడు విఘ్నేశ్ రాజా (పొర్ తొళిళ్)

ఉత్తమ నటుడు (క్రిటిక్స్) శివ కార్తికేయన్ (మావీరన్)

ఉత్తమ నటి (క్రిటిక్స్) ఐశ్వర్యరాయ్ బచ్చన్ (పొన్నియిన్ సెల్వన్ 2)

ప్రొమిసింగ్ న్యూకమర్ (తమిళ్) కెవిన్ (దాదా)

ప్రొడ్యూసర్ ఆఫ్ ది ఇయర్ తిట్టకుడి కన్నన్ రవి (రావణ కొట్టం)

ఎక్స్ టార్డనరీ ఫెర్మార్ ఆఫ్ ది ఇయన్ ఎస్ జే సూర్య

సైమా 2024(మలయాళం) అవార్డు విజేతలు వీరే..

ఉత్తమ నటుడు టొవినో థామస్ (2018)

ఉత్తమ నటి అనస్వర రాజన్ (నెరు)

ఉత్తమ దర్శకుడు జుడే ఆంథోని జోసెఫ్ (2018)

ఉత్తమ చిత్రం నాన్పకల్ నేరుతు మయక్కమ్

ఉత్తమ సహాయ నటుడు హకిమ్ షా (ప్రణయ విలాసం)

ఉత్తమ సహాయ నటి మంజు పిళ్లై

ఉత్తమ విలన్ విష్ణు అగస్త్య (ఆర్డీఎక్స్)

ఉత్తమ కమెడియన్ అర్జున్ అశోకన్ (రోమాంచమ్)

ఉత్తమ పరిచయ నటి అంజనా జయప్రకాశ్ (పచువుమ్ అద్భుత విళుకుమ్)

ఉత్తమ పరిచయ నటుడు సిజు సన్నీ (రోమాంచమ్)

ఉత్తమ సినిమాటోగ్రఫీ అఖిల్ జార్జ్ (2018)

ఉత్తమ లిరిస్ట్ మంజు మంజిత్ (నెల్ల నీలవే -ఆర్డీఎక్స్)

ఉత్తమ గాయకుడు కేఎస్ హరిశంకర్ (వెన్ మేఘం - 2018)

ఉత్తమ నేపథ్య గాయని అన్నే అమీ

ఉత్తమ పరిచయ దర్శకుడు రోమిత్ ఎంజీ క్రిష్ణన్ (ఇరాట్ట)

ఉత్తమ నటుడు (క్రిటిక్స్) జోజు జార్జ్ (ఇరాట్ట)

Tags:    

Similar News