గాయకులతో కూరగాయల బేరాలా?
తెలుగు వాళ్ల కంటే తమిళ వాళ్లే రూపాయి ఎక్కువ ఇస్తారంది. ఈ నేపథ్యంలో తాజాగా గాయకుడు కారుణ్య కూడా తన గళాన్ని వినిపించాడు.
ఇండస్ట్రీలో గాయకుల పరిస్థితి ఎలా ఉంటుంది? అన్నది ఓ సందర్భంలో గాయని ప్రణవి పూస గుచ్చినట్లు వివరిం చింది. పేరు గొప్ప ...ఊరు దిబ్బ అన్న చందంగా కొంత మంది గాయనీగాయకుల పరిస్థితి ఉంటుందన్నారు. అంగట్లో కూరగాయలు బేరాలాడినట్లే పారితోషికం విషయంలో గీసి గీసి బేరాలాడుతారు అంది. డిమాండ్ చేస్తే కొత్త వారితో పాడించుకుంటాం. లేక పోతే అవకాశం ఇస్తే ఉచితంగా పాడేవాళ్లు చాలా మంది ఉన్నారని వాళ్లను చూసు కుంటారని చెప్పుకొచ్చింది.
చివరికి వెయ్యి రూపాయలకు కూడా పాట పాడతారని పరిస్థితిని వివరించింది. అంత వరకూ తాను తీసుకున్న అత్యధిక పారితోషికం 30 వేలు అని..అది ఓ దైవ పాటకు అంత మొత్తం తీసుకున్నానంది. సినిమా పాటలకు ఐదు వేలు..పదివేలు మించి తీసుకున్నది లేదని తన అనుభవాన్ని పంచుకుంది. తెలుగు వాళ్ల కంటే తమిళ వాళ్లే రూపాయి ఎక్కువ ఇస్తారంది. ఈ నేపథ్యంలో తాజాగా గాయకుడు కారుణ్య కూడా తన గళాన్ని వినిపించాడు.
'నేను ఎంత తీసుకోవాలి? అని డిసైడ్ చేయడానికి వాళ్లెవ్వరూ. నా విజయాలు ...నాకొచ్చిన సక్సెస్ లు అధారంగా నాకొక రేటు ఉంటుంది. అంతకు మించి ఒక్క రూపాయి కూడా తగ్గను. అలాగని భారీగా డిమాండ్ చేయను. నా స్థాయిని దాటి పోను. కోట్లు పెట్టి తీసిన సినిమాలకు లక్షల్లో ఆడగలేదు. వేలల్లో మాత్రమే అడిగేది. అలాగే అది చిన్న మొత్తంలోనే ఉంటుంది. వేల నెంబర్ అనేది పెరిగేలా డిమాండ్ చేయను. దానికే కూరగాయాల బేరాల్లాగా, వంకాయలు, ఠెంకాయల్లా బేరాలు ఆడితే ఎలా? మరీ ఎక్కువగా బేరాలు ఆడితే నేను ఖాళీగా ఉన్నాను.
కానీ ఇది నేను చేయలేను అని ఓపెన్ గా చెప్పేస్తాను. దీంతో వారు వాళ్లు ఇంతకు పాడారు..వీళ్లు ఇంతకు పాడరని కన్విన్స్ చేసే ప్రయత్నం చేసినా అవ్వను. వాళ్లు డిఫరెంట్ పర్సన్స్. నేను ఇలా ఉంటాను. అంటే దాన్ని కొంత మంది యాటిట్యూడ్ అంటారు. మనం అలా చెప్పకూడదు. ఫోన్ రాగానే మనం ఒకే చెప్పేసి పాడేసిన తర్వాత ఎంతో కొంత చేతికిస్తే వెళ్లిపోవాలి. ఆ సమయంలో నాకు పని ఉంది? లేదా తర్వాత వస్తాను? ఇలా మనం సమాధానం చెప్పకూడదు. వాళ్లు ఫోన్ చేస్తే వెళ్లిపోవాలి. నాకంటూ ఓ గౌరవం ఉంది. ఈ రంగంలో నేను ఎంత నేర్చుకున్నాను. ఏది సాధించాను అన్నది కూడా వాళ్లు గుర్తించాలి' అని అన్నారు.