అఖిల్.. లైన్ లోకి సూపర్ హిట్ ప్రొడక్షన్

ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి ఇంటరెస్టింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది.

Update: 2024-12-15 08:30 GMT

అక్కినేని యువ హీరో అఖిల్ నుంచి చివరిగా వచ్చిన ‘ఏజెంట్’ డిజాస్టర్ అయ్యింది. ఆయన కెరియర్ లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ మూవీగా ‘ఏజెంట్’ నిలిచింది. దీని తర్వాత అఖిల్ కొత్త సినిమా కోసం ఎక్కువ గ్యాప్ తీసుకున్నారు. యూవీ క్రియేషన్స్ లో అనిల్ కుమార్ అనే కొత్త దర్శకుడితో అఖిల్ సినిమా చేస్తాడని అనుకున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ ఇంకా పట్టాలెక్కలేదు. దీనిపై ఎలాంటి స్పష్టత కూడా లేదు.

దీంతో ఇప్పుడు అఖిల్ హోమ్ బ్యానర్ లోనే మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ ఆల్ మోస్ట్ కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. 2025 ఆరంభంలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతోంది. మనం ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో నాగార్జున, నాగ చైతన్య కలిసి ఈ సినిమాని నిర్మించబోతున్నారు. చిత్తూరు బ్యాక్ డ్రాప్ లో పీరియాడికల్ యాక్షన్ లవ్ డ్రామాగా ఈ మూవీ ఉండబోతోందని టాక్.

త్వరలో సినిమా ప్రారంభోత్సవం ఉండొచ్చనే మాట వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో అఖిల్ కి జోడీగా శ్రీలీలని కన్ఫర్మ్ చేసారంట. ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి ఇంటరెస్టింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది. ఈ సినిమా నిర్మాణంలో సితారా ఎంటర్టైన్మెంట్స్ కూడా భాగం కాబోతోందంట. నాగవంశీని ఈ సినిమా నిర్మాణంలో భాగం కావాలని నాగార్జున అడిగారంట.

దానికి అతను కూడా ఒకే చెప్పాడని తెలుస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ మధ్య వరుసగా సినిమాలు చేస్తూ సక్సెస్ లు అందుకుంటుంది. అలాగే మూవీ నిర్మాణంలో నాగవంశీ చాలా ప్లాన్ తో ఉంటాడనే పేరుంది. ప్రమోషన్స్ కూడా గ్రాండ్ గా చేసి కంటెంట్ ని బలంగా జనాల్లోకి తీసుకొని వెళ్లే ప్రయత్నం చేస్తారు. ‘లక్కీ భాస్కర్’ మూవీతో సూపర్ హిట్ ని సితార ఎంటర్టైన్మెంట్స్ సొంతం చేసుకుంది.

సితార నిర్మాణ భాగస్వామిగా ఉంటే బిజినెస్ పరంగా అఖిల్ సినిమాకి ప్లస్ అవుతుందని నాగార్జున ఆలోచించి వారిని రంగంలోకి దించారంట. అయితే మూవీ గురించి అఫీషియల్ ప్రకటన ఇంకా రాలేదు. ‘వినరో భాగ్యము విష్ణు కథ’ సినిమాతో మురళీ కిషోర్ అబ్బూరు దర్శకుడిగా పరిచయం అయ్యి సూపర్ హిట్ అందుకున్నాడు. రెండో సినిమాని ఇప్పుడు అఖిల్ తో చేయబోతున్నాడు. మరి అఖిల్ కి ఈ యంగ్ డైరెక్టర్ ఎలాంటి సక్సెస్ ఇస్తాడనేది వేచి చూడాలి.

Tags:    

Similar News