సాయి పల్లవి తర్వాత రష్మిక.. కోలీవుడ్ హీరో ప్లాన్ అదుర్స్..!
కోలీవుడ్ లో వీడియో జాకీ నుంచి సిల్వర్ స్క్రీన్ హీరోగా మారాడు టాలెంటెడ్ యాక్టర్ శివ కార్తికేయన్.
కోలీవుడ్ లో వీడియో జాకీ నుంచి సిల్వర్ స్క్రీన్ హీరోగా మారాడు టాలెంటెడ్ యాక్టర్ శివ కార్తికేయన్. అతని సినిమా వస్తుంది అంటే సంథింగ్ స్పెషల్ గా ఉంటుంది అనిపించేలా ఆకట్టుకుంటున్నాడు. వరుస సక్సెస్ లతో శివ కార్తికేయన్ తన సత్తా చాటుతున్నాడు. రీసెంట్ గా అమరన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు శివ కార్తికేయన్. ఈ సినిమాలో సాయి పల్లవి ఫిమేల్ లీడ్ గా నటించింది. మొదటిసారే అయినా శివ కార్తికేయన్ సాయి పల్లవి జోడీ అలరించింది. అమరన్ సక్సెస్ లో సాయి పల్లవి కంట్రిబ్యూషన్ కూడా ఉందని చెప్పొచ్చు.
ఇదిలా ఉంటే శివ కార్తికేయన్ తన నెక్స్ట్ సినిమా శిబి చక్రవర్తి డైరెక్షన్ లో చేస్తున్నాడు. ఆల్రెడీ ఈ ఇద్దరు కలిసి డాన్ సినిమా చేశారు. అసలైతే శిబి చక్రవర్తి ఈమధ్య తెలుగు హీరో న్యాచురల్ స్టార్ నానితో ఒక సినిమా చేయాలని అనుకున్నారు. కానీ ఈ కాంబో చర్చల దశలోనే ఆగిపోయింది. మరి ఆ కథతోనే శివ కార్తికేయన్ తో చేస్తున్నారా అన్నది తెలియాల్సి ఉంది. ఆల్రెడీ హిట్ కాంబో కాబట్టి ఈ సినిమాపై క్రేజ్ ఏర్పడింది.
శివ కార్తికేయన్ సరసన ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా ఫిక్స్ అయ్యింది. పాన్ ఇండియా లెవెల్ లో రష్మిక ఫాం ఏంటన్నది తెలిసిందే. ఆమె చేసిన ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. హీరోగా శివ కార్తికేయన్, హీరోయిన్ గా రష్మిక ఇద్దరు కూడా వరుస హిట్లతో సూపర్ ఫాం లో ఉన్నారు. ఈ ఇద్దరు కలిసి చేసే సినిమా తప్పకుండా సూపర్ సక్సెస్ అవుతుందని చెప్పొచ్చు. శివ కార్తికేయన్ అమరన్ లో సాయి పల్లవి కథానాయికగా చేసింది. ఆమె లక్ సినిమాకు తోడై సూపర్ హిట్ అయ్యింది.
ఇప్పుడు నెక్స్ట్ రష్మికతో జత కడుతున్నాడు. నేషనల్ వైడ్ గా రష్మిక రచ్చ కనబడుతూనే ఉంది. సో శివ కార్తికేయన్ కథ కథనాలు మాత్రమే కాదు పర్ఫెక్ట్ కాంబినేషన్ గా హిట్ కొట్టే జోడీలనే సెట్ చేసుకుంటున్నాడు. తప్పకుండా ఈ కలయికలో ఒక సూపర్ హిట్ వస్తుందని అంచనా వేయొచ్చు. రష్మిక మందన్న ప్రస్తుతం కుబేర, ది గర్ల్ ఫ్రెండ్, సికిందర్ సినిమాల్లో నటిస్తుంది. వీటితో పాటు లేటెస్ట్ గా శివ కార్తికేయన్ సినిమా ఓకే చేసినట్టు తెలుస్తుంది.