అట్లీ విజ‌యాన్ని సెల‌బ్రేట్ చేయాల‌న్న హీరో

అట్లీని అభిమానులు చాలా తేలికగా విమర్శిస్తారని కూడా అతను చెప్పాడు. అతడు మరేదైనా సౌత్ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి అయితే, అతడి విజ‌యాన్ని తారలు, అభిమానులు బాగా సెల‌బ్రేట్ చేసుకునేవార‌ని వ్యాఖ్యానించారు.

Update: 2024-01-07 02:45 GMT

శివకార్తికేయన్ న‌టించిన‌ 'అయలాన్' సంక్రాంతి బ‌రిలో విడుద‌ల‌వుతుండ‌గా చిత్ర‌బృందం ప్రమోషన్‌లో బిజీగా ఉంది. ఇటీవల ఓ యూట్యూబ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో శివకార్తికేయన్ స‌హ‌చ‌రుడు, కోలీవుడ్ దర్శకుడు అట్లీ విజ‌యాల‌ గురించి మ‌న‌సు విప్పి మాట్లాడారు. అట్లీపై వచ్చిన విమర్శలపై స్పందించారు. అట్లీ లక్ష్యాన్ని తాను గౌరవిస్తానని, దర్శకుడిగా తన లక్ష్యాన్ని సరిగ్గా సాధించి బ్లాక్‌బస్టర్ చిత్రాలను అందిస్తున్నాడ‌ని శివకార్తికేయన్ ప్ర‌శంసించారు. అట్లీని అభిమానులు చాలా తేలికగా విమర్శిస్తారని కూడా అతను చెప్పాడు. అతడు మరేదైనా సౌత్ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి అయితే, అతడి విజ‌యాన్ని తారలు, అభిమానులు బాగా సెల‌బ్రేట్ చేసుకునేవార‌ని వ్యాఖ్యానించారు.

షారుఖ్ ఖాన్‌తో సినిమా చేయడమే కాకుండా, రూ.1200 కోట్ల వ‌సూళ్ల‌తో బాక్సాఫీస్ వ‌ద్ద అసాధార‌ణ విజ‌యాన్ని అందించడం అంత తేలికైన పని కాదు. చాలా మంది పాపుల‌ర్ ద‌ర్శ‌కులు కూడా అలా చేయడంలో విఫలమయ్యార‌ని శివ కార్తికేయ‌న్ అట్లీకి మరింత మద్దతునిచ్చాడు. అట్లీ తన ప్రతి సినిమాతో గరిష్ట స్థాయికి ఎదిగే ప్రయత్నాన్ని అభినందించాడు.

ద‌ళ‌ప‌తి విజయ్‌తో అట్లీ చేసిన మ్యాజిక్‌ను శివకార్తికేయన్ మెచ్చుకున్నాడు. తప్పుల‌ను గుర్తు చేస్తూనే, అతని ప్రయత్నాన్ని మెచ్చుకోవాలని అభిమానులను కోరాడు. అట్లీపై శివకార్తికేయన్‌ ప్రశంసలకు అనుగుణంగా సోష‌ల్ మీడియాల్లోను అభిమానులు మ‌ద్ధ‌తు ప‌లికారు. కోలీవుడ్‌లో అత్యుత్తమ వినోదాన్ని అందించే దర్శకుల్లో ఒకరైన అట్లీని ప్రశంసించడం ప‌రిశ్ర‌మ‌లో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది.

శివకార్తికేయన్ తదుపరి విడుదల 'అయలాన్'.. సంక్రాంతి బ‌రిలో జనవరి 12 న విడుదలవుతోంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ధనుష్ 'కెప్టెన్ మిల్లర్'.. అరుణ్ విజయ్ 'మిషన్'తో పోటీప‌డ‌నుంది. 'అయలాన్' ట్రైలర్ ఇంత‌కుముందే విడుద‌లై ఆక‌ట్టుకుంది. ఇటీవ‌ల విడుద‌ల చేసిన‌ ప్రమోషనల్ వీడియో సినిమాపై బజ్ పెంచింది. తెలుగులోను అయ‌లాన్ విడుద‌ల కానుంది.

Tags:    

Similar News