ఎస్.జె.సూర్య.. ఈ క్రేజ్ తో ప్రమాదం కూడా..

ఇలా సౌత్ లో సూర్య మీద ఓవర్ ఎక్స్ పోజర్ ఉంది. దర్శకులు అందరూ కూడా విలన్ పాత్రల కోసం ఎస్.జె.సూర్యని సంప్రదిస్తున్నారు.

Update: 2024-07-24 09:30 GMT

కొంతమంది యాక్టర్స్ ఒకటి, రెండు సినిమాలలో విభిన్నమైన పాత్రలని చేస్తూ ఊహించని క్రేజ్ సొంతం చేసుకుంటారు. విలన్ పాత్రలకి కేరాఫ్ అడ్రెస్ గా మారిపోతారు. ఒక్కసారిగా పెరిగిన ఫేమ్ కారణంగా దర్శకులు కూడా సదరు యాక్టర్ ని తమ సినిమాలలో విలన్ పాత్రల కోసం ఎంపిక చేసుకుంటారు. ఒకేసారి గంపగుత్తగా అవకాశాలు వచ్చిపడతాయి. క్రేజ్ ఉన్నప్పుడే క్యాష్ చేసుకోవాలనే ఆలోచనతో యాక్టర్స్ కూడా వచ్చిన ప్రతి అవకాశాన్ని ఒప్పేసుకుంటారు.

కొంతకాలానికి వారికి వచ్చిన ఓవర్ ఎక్స్ పోజర్ ని యాక్టర్స్ కొనసాగించలేక ఫేడ్ అవుట్ అయిపోతారు. ఒకే తరహా క్యారెక్టర్స్ ని రిపీట్ గా చేయడంతో ప్రేక్షకులకి కూడా ఆ నటుల మీద ఆసక్తి తగ్గిపోతుంది. అలాగే ప్రకాష్ రాజ్ టాలీవుడ్ లో ఓవర్ ఎక్స్ పోజర్ తో వరుసగా అవకాశాలు సొంతం చేసుకున్నారు. తరువాత రొటీన్ విలనిజంతో ప్రేక్షకులకి డిస్ కనెక్ట్ అయ్యాడు. నిజానికి ప్రకాష్ రాజ్ లో విలక్షణ నటుడు ఉన్నాడు.

అతని నటనని ఎలివేట్ చేసే క్యారెక్టర్స్ ప్రకాష్ రాజ్ కి చాలా తక్కువ వచ్చాయి. స్టార్ గా ఉన్నప్పుడు ఒకే తరహా పాత్రలు ఎక్కువగా చేశాడు. జగపతిబాబుకి లెజెండ్ సినిమాతో విలన్ గా ఓవర్ ఎక్స్ పోజర్ వచ్చింది. తరువాత వరుస సినిమాలు ఒకే తరహా పాత్రలు చేస్తూ వచ్చాడు. మరల లైన్ మార్చుకొని ఇప్పుడు సెలక్టివ్ గా స్ట్రాంగ్ క్యారెక్టరైజేషన్ ఉన్న పాత్రలు మాత్రమే జగపతి బాబు చేస్తున్నాడు. ఇప్పుడు అదే తరహా ఓవర్ ఎక్స్ పోజర్ ఎస్.జె.సూర్యకి వచ్చింది.

స్పైడర్ సినిమాలో పవర్ ఫుల్ విలన్ గా నటించిన సూర్యకి కోలీవుడ్ ఊహించని క్రేజ్ వచ్చింది. వరుసగా అవకాశాలు వచ్చాయి. స్టార్ హీరోల నుంచి వచ్చే సినిమాలలో ఎక్కువగా అతనే విలన్ గా కనిపిస్తున్నాడు. ఇప్పుడు టాలీవుడ్ లోకి కూడా సరిపోదా శనివారం సినిమాతో మరోసారి విలన్ గా నటించాడు. ప్రస్తుతం ఎస్.జె.సూర్య చేతినిండా సినిమాలు ఉన్నాయి. మానాడు, డాన్, జిగర్తాండ డబుల్ ఎక్స్ సినిమాలలో విలక్షణ నటనతో సూర్య మెప్పించాడు. ప్రస్తుతం అతని నుంచి రాయన్, సరిపోద శనివారం, గేమ్ ఛేంజర్, ఇండియన్ 3 సినిమాలు వరుసగా రాబోతున్నాయి.

ఇలా సౌత్ లో సూర్య మీద ఓవర్ ఎక్స్ పోజర్ ఉంది. దర్శకులు అందరూ కూడా విలన్ పాత్రల కోసం ఎస్.జె.సూర్యని సంప్రదిస్తున్నారు. అయితే ఇప్పుడు విలక్షణమైన పాత్రలని ఎంపిక చేసుకొని నటుడిగా సుదీర్ఘకాలం కొనసాగడం అనేది అతని చేతిలో ఉంది. అలా కాకుండా రెగ్యులర్ విలనిజంతో వచ్చిన ప్రతి అవకాశం ఒప్పేసుకుంటే కొంతకాలానికి ఫేడ్ అవుట్ అయ్యే అవకాశం ఉందనే మాట ఇండస్ట్రీలో ఉంది. ఇలాగే ఓవర్ ఎక్స్ పోజర్ కారణంగా తక్కువ సినిమాలకి పరిమితం అయిపోయిన యాక్టర్స్ చాలా మంది సౌత్ లో ఉన్నారని సినీ విశ్లేషకులు అంటున్నారు.

Tags:    

Similar News