షారూఖ్ అమితాబ్ కాదనుకున్నది 1600 కోట్లు కొల్లగొట్టింది!
అయితే దిగ్గజాలు ఆ సినిమాలో నటించి ఉండకపోవచ్చు... కానీ అది 1000 కోట్ల క్లబ్‌లో చేరింది
బాలీవుడ్ టాప్ హీరోలు షారూఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్ సహా గోవిందా వంటి స్టార్లకు ఆ సినిమాలో ఒక పాత్రను ఆఫర్ చేసారు. కానీ ఆ పాత్రలో ఉన్న నెగెటివ్ షేడ్ నచ్చకపోవడంతో దానిని సున్నితంగా తిరస్కరించారు. అయితే దిగ్గజాలు ఆ సినిమాలో నటించి ఉండకపోవచ్చు... కానీ అది 1000 కోట్ల క్లబ్‌లో చేరింది. ప్రపంచవ్యాప్తంగా 1600 కోట్ల నెట్ వసూలు చేసింది.
ఇదంతా దేని గురించి? అంటే.. డానీ బోయిలే తెరకెక్కించిన `స్లమ్ డాగ్ మిలియనీర్` కోసం పడిన శ్రమ దాని ఫలితాన్ని తెలియజేసేందుకు ఈ ప్రయత్నం. ఈ చిత్రంతో బాలీవుడ్ లో అడుగుపెట్టిన చాలా మంది ఆరంగేట్రమే బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రిటిక్స్ ప్రశంసలు అందుకుంది. నటీనటులకు మంచి పేరొచ్చింది. అంతే కాదు ఈ చిత్రంలోని పాటలు కూడా హిట్‌గా నిలిచి సంగీత దర్శకుడికి ఆస్కార్ అవార్డును అందించాయి. ఈ చిత్రం అకాడమీ అవార్డ్స్‌లో పెద్ద పురస్కారాలు గెలుపొందింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే, ఉత్తమ సినిమాటోగ్రఫీ, ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్, ఉత్తమ ఒరిజినల్ స్కోర్, ఉత్తమ ఒరిజినల్ సాంగ్ ( జై హో) వంటి 8 ఆస్కార్‌లను గెలుచుకుంది. ఉత్తమ సంగీత దర్శకుడిగా A. R. రెహమాన్, ఉత్తమ గీత రచయితగా గుల్జార్ లకు ఆస్కార్‌లు దక్కాయి. ఈ చిత్రం 7 BAFTA అవార్డులు 4 గోల్డెన్ గ్లోబ్ అవార్డులను కూడా గెలుచుకుంది.
స్లమ్‌డాగ్ మిలియనీర్ ముంబై జుహులోని మురికివాడలకు చెందిన 18 ఏళ్ల జమాల్ మాలిక్ కథతో రూపొందింది. అతడు మిలియనీర్ ఎలా అయ్యాడు? అన్నదే కాన్సెప్టు. కేబీసీ తరహా రియాలిటీ షోలో అతడు మిలియనీర్ అవుతాడు.. కానీ మోసం చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటాడు. అరెస్టయ్యాక అతడు తన జీవిత కథను పోలీసులకు వివరిస్తాడు.. అతను ఎలా జీవించాడో కూడా వివరిస్తాడు. ప్రతి ప్రశ్నకు సమాధానం ఎలా ఇచ్చాడో చెబుతాడు. ఈ చిత్రంలో అనిల్ కపూర్ కేబీసీ హోస్ట్ గా కనిపించారు. ఇర్ఫాన్ ఖాన్, దేవ్ పటేల్, ఫ్రీదా పింటో, మధుర్ మిట్టల్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం దేవ్ పటేల్ కి కెరీర్ తొలి చిత్రం. ఆరంగేట్రమే అతడిని స్టార్‌గా మార్చింది. ఆ తర్వాత అతను అనేక హిట్ చిత్రాలలో నటించాడు. ఇప్పుడు మంకీ మ్యాన్‌తో దర్శకుడిగా పరిచయం అయ్యాడు.
స్లమ్ డాగ్ మిలియనీర్ రూ.124 కోట్లతో తెరకెక్కింది. కానీ ఈ సినిమా టైటిల్ వివాదం సృష్టించింది. అనిల్ కపూర్ కంటే ముందు, టీవీ హోస్ట్ పాత్రను షారుఖ్ ఖాన్‌కు ఆఫర్ చేశారు. అతడు ఆ పాత్ర చేయడానికి అంగీకరించాడు. అయితే తర్వాత ప్రేమ్ పాత్ర చాలా నీచంగా మోసపూరితంగా అనిపించింది. దాంతో వదులుకున్నారు. షారుఖ్ కాకుండా, అమితాబ్ బచ్చన్, గోవిందాకు కూడా ఈ పాత్రను ఆఫర్ చేశారు. అయితే వారిద్దరూ కూడా తిరస్కరించారు. ఇన్ని సమస్యల నడుమ కూడా ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ. 3145 కోట్లు వసూలు చేసింది. ఇది మాత్రమే కాదు ఎనిమిది ఆస్కార్ అవార్డులు గెలుచుకుని, గోల్డెన్ గ్లోబ్ పురస్కారాన్ని గెలుచుకుని సంచలనం సృష్టించింది.