దేవసేనలా కొత్త పెళ్లి కూతురు శోభిత!
హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో అక్కినేని వారసుడి వివాహ తంతు జరగనుంది.
హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల.. మరికొద్ది రోజుల్లో అక్కినేని ఇంట కోడలిగా అడుగుపెట్టనున్న విషయం తెలిసిందే. యంగ్ హీరో నాగచైతన్య.. ఆమె మెడలో డిసెంబర్ 4వ తేదీ రాత్రి మూడు ముళ్లు వేయనున్నారు. వేద మంత్రాల మధ్య.. సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య చైతూ, శోభిత వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు.
హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో అక్కినేని వారసుడి వివాహ తంతు జరగనుంది. అచ్చమైన తెలుగు పెళ్లిగా చైతూ, శోభిత మ్యారేజ్ జరగనుందని ఇప్పటికే నాగార్జున తెలిపారు. స్టూడియోలోని దివంగత అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం ఎదురుగా శోభిత మెడలో మూడుముళ్లు వేయనున్నానని చైతన్య ఇటీవల చెప్పారు.
అయితే మరో నాలుగు రోజుల్లో చైతూ, శోభిత వివాహ వేడుక జరగనుండగా.. ఇప్పటికే వేడుకలు మొదలయ్యాయి. నిన్న ఉదయం కాబోయే వధూవరులకు ఒకే చోట ఉంచి మంగళస్నానాలు నిర్వహించారు కుటుంబ సభ్యులు. సంప్రదాయబద్ధంగా జరిగిన ఈ వేడుకకు కుటుంబ సభ్యులతోపాటు అత్యంత సన్నిహితులు మాత్రమే వెళ్లారు.
అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. కొత్త జంటకు అడ్వాన్స్ గానే అంతా శుభాకాంక్షలు చెబుతున్నారు. అదే సమయంలో శోభిత.. అఫీషియల్ గా వివాహ తంతు పిక్స్ ను పోస్ట్ చేశారు. తన పెళ్లి వేడుకకు సంబంధించిన రాట స్థాపన, మంగళ స్నానాల పిక్స్ ను షేర్ చేశారు.
అయితే పలు ప్రాంతాల సంప్రదాయాల ప్రకారం.. రాట స్థాపనతో వివాహ వేడుక ప్రారంభమవుతుంది. ఆ తర్వాత మంగళ స్నానాలు చేయిస్తారు. దీంతో శోభిత ఇంట కూడా అలాగే జరిగినట్లు కనిపిస్తోంది. ఆమె పోస్ట్ చేసిన పిక్స్ లో చాలా బాగున్నారు శోభిత. తెలుగుదనం ఉట్టిపడేలా రెడీ అయ్యి.. కొత్త పెళ్లి కూతురిగా సందడి చేశారు.
నెట్టింట శోభిత ధూళిపాళ్ల పోస్ట్ చేసిన పిక్స్ వైరల్ గా మారగా.. నెటిజన్లు తెగ స్పందిస్తున్నారు. బాహుబలి మూవీలోని దేవసేనలా శోభిత కనిపిస్తున్నారని చెబుతున్నారు. మరికొందరు బాహుబలి సాంగ్ ను కాస్త మార్చి కామెంట్లుగా పెడుతున్నారు. వెల్ కమ్ టు అక్కినేని ఫ్యామిలీ అంటూ సందడి చేస్తున్నారు. వెయిటింగ్ ఫర్ మ్యారేజ్ పిక్స్ అని చెబుతున్నారు. మరి శోభిత పోస్ట్ చేసిన కొత్త పిక్స్ ను చూశారా మీరు?