మెగాస్టార్‌కి కోడ‌లు శోభిత‌ను ప‌రిచ‌యం చేసిన నాగ్

ANR నేషనల్ అవార్డ్ 2024 ఈవెంట్ నేటి సాయంత్రం (2024 అక్టోబర్ 28) అన్న‌పూర్ణ స్టూడియోస్ లో వైభ‌వంగా సాగుతోంది.

Update: 2024-10-28 15:07 GMT

ANR నేషనల్ అవార్డ్ 2024 ఈవెంట్ నేటి సాయంత్రం (2024 అక్టోబర్ 28) అన్న‌పూర్ణ స్టూడియోస్ లో వైభ‌వంగా సాగుతోంది. ఈ వేడుక‌కు సినీ దిగ్గ‌జాలు అటెండ‌య్యారు. ఫంక్షన్‌కి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్ప‌టికే ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ అవుతున్నాయి. ముఖ్యంగా నాగ చైతన్య ఈ ఈవెంట్‌కు వచ్చినప్పుడు స్పెషల్ గెస్ట్ అమితాబ్ బచ్చన్ పాదాలను తాకి ఆశీస్సులు అందుకోవ‌డం అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. అత‌డి విన‌మ్ర‌త ఆక‌ట్టుకుంది.

ఈ ఈవెంట్‌లో నాగ చైతన్య తన కాబోయే భార్య శోభితా ధూళిపాళతో కలిసి స్టైలిష్‌గా ఎంట్రీ ఇచ్చాడు. ఇద్దరూ తమ ఫార్మల్ దుస్తులలో అద్భుతంగా కనిపించారు. చై అద్భుతమైన నీలి రంగు బ్లేజ‌ర్ ని ధరించగా, శోభిత హ‌బ్బీ రూపానికి సంపూర్ణంగా సరిపోయే పచ్చటి దుస్తులలో అబ్బురపరిచింది.

ఈ సంవత్సరం మెగాస్టార్ చిరంజీవిని సత్కరించేందుకు అమితాబ్ బచ్చన్ ANR నేషనల్ అవార్డ్స్ 2024 ఈవెంట్‌కు వచ్చారు. అక్కినేని నాగేశ్వరరావు గౌరవార్థం అక్కినేని కుటుంబం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో అమితాబ్ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ కాగా, తెలుగు సినిమా నుండి పలువురు తారలు కూడా వచ్చారు.

ఇక ఈ వేదిక ఆద్యంత నాగ చైతన్య- శోభిత హంగామా కనిపించింది. ఆ ఇద్ద‌రూ అతిథుల‌ను రిసీవ్ చేసుకుంటూ జోరు చూపించారు. అయితే ఇదే వేదిక‌పై అక్కినేని నాగార్జున త‌న కాబోయే కోడ‌లు శోభిత‌ను అవార్డు గ్ర‌హీత‌, మెగాస్టార్ చిరంజీవికి ప‌రిచ‌యం చేయ‌డం అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. చిరుతో శోభిత‌-చైతూ ఇద్ద‌రూ చాలా సేపు ముచ్చ‌ట్ల‌తో గ‌డిపారు. మెగాస్టార్ ఈ జంట‌తో స‌ర‌దాగా మాట్లాడుతూ వారిని న‌వ్వించ‌డం ఆయ‌న భోళా స్వ‌భావాన్ని, వ‌య‌సులో చాలా చిన్న‌వారితోను క‌లిసిపోయే ఆయ‌న మంచిత‌నాన్ని ఆవిష్క‌రించింది. అమితాబ్ చేతుల‌మీదుగా మెగాస్టార్ చిరంజీవికి ఏఎన్నార్ జాతీయ అవార్డును అందిస్తున్న ఈ క్ష‌ణం మెగాభిమానుల్లో గొప్ప ఆనందాన్ని క‌లిగించింది. లైవ్ కార్య‌క్ర‌మం స్ట్రీమింగ్ అవుతోంది.

Tags:    

Similar News