వెయ్యి ఆడిషన్స్ ఇవ్వాల్సి వచ్చేది!
ఆకట్టుకునే అందంతో పాటు నటనలో మంచి ప్రతిభ పైగా మంచి డాన్సర్ అవ్వడం వల్ల శోభిత దూళిపాళ కు మంచి ఆఫర్లు వస్తున్నాయి
తెలుగు అమ్మాయిలు చిన్న సినిమాలకు, వెబ్ సిరీస్ లకు పరిమితం అవ్వాల్సిందే అనుకుంటూ ఉన్న సమయంలో శోభిత దూళిపాళ అనూహ్యంగా బాలీవుడ్ లో మంచి పేరు దక్కించుకుంది. అక్కడ వరుసగా సినిమాలు చేస్తూ, వెబ్ సిరీస్ లతో హిందీ ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది.
ఆకట్టుకునే అందంతో పాటు నటనలో మంచి ప్రతిభ పైగా మంచి డాన్సర్ అవ్వడం వల్ల శోభిత దూళిపాళ కు మంచి ఆఫర్లు వస్తున్నాయి. సోషల్ మీడియాలో ఆమెకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా ఈ అమ్మడు తన కెరీర్ ఎలా ప్రారంభం అయ్యిందనే విషయమై సోషల్ మీడియా ద్వారా పంచుకుంది.
శోభిత మాట్లాడుతూ.. నాకు ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ ఏమీ లేదు. దాంతో నేను ఆడిషన్స్ ద్వారా మాత్రమే ఇండస్ట్రీలో అడుగు పెట్టాల్సి ఉంటుంది. ఆ విషయం అర్థం చేసుకుని డాన్సర్ ను అయిన నేను యాక్టింగ్ లో శిక్షణ తీసుకున్నాను. యాక్టింగ్ శిక్షణ తీసుకుంటూ మూడు సంవత్సరాల సమయం లో నటిగా నిరూపించుకోవాలని టార్గెట్ పెట్టుకున్నాను.
నేను రామన్ రాఘవ్ 2.0 కోసం మొదటి ఆడిషన్ కి వెళ్లాను. ఒక వేళ నేను రామన్ రాఘవ్ 2.0 లో భాగం అయ్యి ఉండకుంటే కచ్చితంగా ఇంకా ఆడిషన్స్ ఇస్తూనే ఉండేదాన్ని. వెయ్యి కి పైగా ఆడిషన్స్ ఇవ్వాల్సి వచ్చేదని శోభిత కామెంట్స్ చేసింది.
ఇండస్ట్రీ లో పరిచయాలు ఉంటేనే మనుగడ అనే వాదనకు ఆమె చెక్ పెట్టింది. ప్రతిభ తో ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకోవచ్చు అంటూ శోభిత నిరూపించింది అని ఆమె అభిమానులు అంటూ ఉంటారు. బాలీవుడ్ తో పాటు టాలీవుడ్, కోలీవుడ్ మరియు మలయాళ సినిమాల్లో కూడా శోభిత నటించి తన నటనతో మెప్పించింది.