శోభితని బ్యాక్ గ్రౌండ్ మోడల్ గా కూడా పనికిరావు!
ఇవన్నీశోభిత ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేసింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. శోభిత కి ఇండస్ట్రీ నుంచి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేదు.
తెలుగమ్మాయి శోభిత త్వరలో అక్కినేని ఇంట కోడలు కాబోతుంది. నాగచైతన్యకు సతీమణిగా అడుగు పెడుతుంది. ఇప్పటికే నిశ్చితార్దం కూడా పూర్తయింది. ఇక నటిగా శోభిక జర్నీ ఎంతో ఇంట్రెస్టింగ్. బాలీవుడ్ టూ టాలీవుడ్ కి వచ్చిన నటి. ఓతెలుగు నటి బాలీవుడ్ కివెళ్లి సక్సెస్ అవ్వడం అంటే చిన్న విషయం కాదు. అందులో శోభిత గ్రేట్ అనాలి. తనలో ఆ యూనిక్ క్వాలిటీనే సంథిగ్ స్పెషల్ గా హైలైట్ చేస్తుంది. ఇది నేడు శోభిత స్థానం.
అయితే ఒక్కసారి పాస్ట్ లైఫ్ లోకి వెళ్తే..ఎదిగే క్రమంలో శోభిత సైతం చాలా అవమానాలే ఎదుర్కున్నట్లు తెలుస్తోంది. వైజాగ్ లో ఇంటర్ అయిన తర్వాత డిగ్రీ నేరుగా ముంబైలో చేరిందిట. అప్పుడే మిస్ ఇండియా పోటీల్లో పాల్లోనడం ప్రారంభించింది. ఈ క్రమంలో తెల్లగా లేవని ఎంతో మంది విమర్శించారుట. ఓ షాంపు యాడ్ కోసం ఆడీషన్ కి వెళ్తే నువ్వు బ్యాక్ గ్రౌండ్ మోడల్ గా కూడా పనికిరావ్ అన్నారుట. దీంతో ఆమె ఇంటికెళ్లి అద్దంలో ముఖం చూసుకుని ఏడ్చిన రోజులెన్నో ఉన్నాయట.
ఆ నెగిటివిటీ నుంచి బయటకు రావడానికి చాలా సమయం పట్టిందిట. ఇలాంటి అవమానాలు ఎన్నో కెరీర్ ఆరంభంలో ఎదుర్కుందిట. మోడలింగ్ రంగం నుంచి నటిగా మారడం అంత వీజీ కాదు అని ..ఎన్నో అవమానాలు భరిస్తే తప్ప స్థాయి సాద్యం కాలేదు అంది. ఇవన్నీశోభిత ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేసింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. శోభిత కి ఇండస్ట్రీ నుంచి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేదు.
తల్లి టీచర్..తండ్రి నేవీ ఆఫీసర్. ఇరువురు తెలుగు వారే. శోభిత పుట్టింది తెనాలి. పెరిగింది, చదువుకుంది అంతా వైజాగ్ లోనే. కానీ బాలీవుడ్ సినిమాలు చేసి టాలీవుడ్కి రావడంతో ఆమెని అంతా హిందీ అమ్మాయి అనుకుంటు న్నారు. కానీ అమె పదహారణాల తెలుగు అమ్మాయి. తెలుగు ఎంతో చక్కాగా మాట్లాడుతుంది.