చైతూ నీకో దండం సామీ: శోభిత
అయితే తండేల్ రిలీజ్ నేపథ్యంలో.. భర్తకు బెస్ట్ విషెస్ చెబుతూ ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో క్యూట్ పోస్ట్ పెట్టారు శోభితా అక్కినేని.
టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య.. తండేల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. నేచరుల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన ఆ సినిమాను శ్రీకాకుళం జిల్లాలోని కొందరు మత్స్యకారుల జీవితంలో జరిగిన నిజ జీవిత ఘటన ఆధారంగా చందూ మొండేటి గ్రాండ్ గా తెరకెక్కించారు.
ప్రముఖ గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పించగా బన్నీ వాసు నిర్మించారు. రిలీజ్ కు ముందే భారీ అంచనాలు నెలకొల్పిన మూవీ.. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వరల్డ్ వైడ్ గా విడుదలైంది. అయితే తండేల్ రిలీజ్ నేపథ్యంలో.. భర్తకు బెస్ట్ విషెస్ చెబుతూ ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో క్యూట్ పోస్ట్ పెట్టారు శోభితా అక్కినేని.
"తండేల్ మూవీ షూటింగ్ జరుగుతున్నప్పుడు ఎంత ఫోకస్డ్ గా.. పాజిటివ్ గా ఉన్నారో చైతూను చూశా. అందుకే ఎక్స్ట్రా ఆర్డినరీ లవ్ స్టోరీ థియేటర్లలో ఎక్స్పీరియన్స్ చేయడానికి ప్రేక్షకులు అందరితో పాటు నేనూ ఎగ్జైటెడ్ గా ఉన్నాను" అని శోభిత రాసుకొచ్చారు. ఆ తర్వాత ఆమె రాసుకొచ్చిన క్రేజీ లైన్.. ఇప్పుడు వైరల్ గా మారింది.
''ఫైనల్లీ గడ్డం షేవ్ చేస్తావు. మొదటిసారి నీ ముఖం దర్శనం అవుతుంది సామీ'' అని చైతూ ట్యాగ్ చేశారు శోభిత. నిజానికి సినిమాలో రాజు క్యారెక్టర్ కోసం నాగ చైతన్య గడ్డం పెంచిన విషయం తెలిసిందే. ఏడాదిగా గడ్డంతో కనిపిస్తున్నారు. తన వివాహ వేడుకలో కూడా గడ్డంతో కనిపించి సందడి చేశారు చైతూ.
ఇప్పుడు పెళ్లి తర్వాత తొలిసారి గడ్డం లేకుండా కనిపించనున్నారన్నమాట. అందుకు శోభిత కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నట్టు క్లియర్ గా తెలుస్తుంది. అయితే శోభిత పోస్ట్ ను రీ పోస్ట్ చేశారు చైతూ. థాంక్యూ మై బుజ్జి తల్లి అంటూ రిప్లై ఇచ్చారు. వీళ్లిద్దరి ఇన్ స్టా కన్వర్జేషన్ ఎంతో ముద్దు ముద్దుగా ఉందని అభిమానులు చెబుతున్నారు.
అయితే కొంతకాలం పాటు ప్రేమించుకున్న నాగచైతన్య, శోభిత గత ఏడాది.. వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఆగస్టు 8న కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంగేజ్మెంట్ చేసుకుని అందరికీ సర్ప్రైజ్ ఇచ్చారు. పెళ్లి మాత్రం డిసెంబర్ 4వ తేదీన అన్నపూర్ణ స్టూడియోలో అంగరంగ వైభవంగా చేసుకున్నారు. దివంగత ఏఎన్నార్ విగ్రహం ఎదురుగా మూడుముళ్ల బంధంతో ఒకటయ్యారు. ఇప్పుడు పెళ్లి తర్వాత తండేల్ తో వచ్చారు నాగ చైతన్య.