డబుల్ ఇస్మార్ట్ ను.. టార్గెట్ చేశారా?

ఇక సోషల్ మీడియాలో అయితే డబుల్ ఇస్మార్ట్ ను టార్గెట్ చేశారా? అనే విధంగా కామెంట్స్ వస్తున్నాయి.

Update: 2024-07-30 08:49 GMT

ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి సక్సెస్ చూసిన రామ్ - పూరి ఇప్పుడు సీక్వెల్ గా వస్తున్న డబుల్ ఇస్మార్ట్ తో మరో హిట్ కొట్టడానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమా సాంగ్స్ తో ఇప్పటికే మాస్ ఆడియెన్స్ లో మంచి హైప్ క్రియేట్ చేసుకుంది. సినిమా విడుదలకు ఇంకా రెండు వారాలే మిగిలివున్నాయి. ఈ టైమ్ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ చేస్తున్న మేకర్స్ చాలా కాన్ఫిడెన్స్ తో కనిపిస్తున్నారు.

పాన్ ఇండియా రేంజ్ లోనే సినిమాను విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇదే టైమ్ లో కొన్ని రూమర్స్ కూడా వైరల్ అవుతున్నాయి. ఎంతవరకు నిజం అనే విషయంలో అసలు క్లారిటీ లేదు కానీ సినిమాకు సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. నైజాంలో ఎగ్జిబిటర్ల వివాదం ఇంకా వేడెక్కిందనే టాక్ వస్తోంది.

ఫిలిం ఛాంబర్ నుండి ఇదివరకే మేకర్స్ కు రిలీఫ్ కలిగేలా క్లీన్ చిట్ వచ్చినప్పటికీ, ఎగ్జిబిటర్లకు లైగర్ కు సంబంధించి తగినంత నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారట. నైజాం ఏరియా ఎగ్జిబిటర్లకు ఎనిమిది కోట్ల వరకు రాయితీ ఇవ్వాలట.

ఇప్పుడు, లీగల్ గా లయబులిటీ లేకపోయినా, థియేటర్ల యజమానులతో విభేదాలు తొలగించేందుకు ప్రయత్నం చేస్తున్నారని కథనాలు వస్తున్నాయి. నైజాంలోని థియేటర్ యజమానులు అంతా కలిసి ఇస్మార్ట్ సినిమాను ప్రదర్శించకూడదని నిర్ణయం తీసుకున్నట్లు ఒక ప్రచారం నడుస్తోంది. అయితే ఈ విషయంలో ఇప్పటివరకు ఎవరు అసలు క్లారిటీ ఇవ్వలేదు. ఇక సోషల్ మీడియాలో అయితే డబుల్ ఇస్మార్ట్ ను టార్గెట్ చేశారా? అనే విధంగా కామెంట్స్ వస్తున్నాయి. నిజానికి డిస్ట్రిబ్యూటర్స్ కు డబ్బులు ఇవ్వకుంటే వాళ్ళ థియేటర్లలో ఇస్మార్ట్ పడదు. ప్రముఖ సంస్థల చేతిలోనే 130కి పైగా థియేటర్లు అయితే ఉన్నాయి.

మరి ఇది ఎంతవరకు నిజం అనేది తెలియాలి అంటే మేకర్స్ నుంచి ఒక క్లారిటీ రావాలి. ఇక డబుల్ ఇస్మార్ట్ కు పోటీగా రవితేజ-మిస్టర్ బచ్చన్, విక్రమ్ తగలాన్ సినిమాలు కూడా ఉన్నాయి. థియేటర్స్ పంపిణీ విషయంలో కూడా చర్చలు గట్టిగానే జరిగే అవకాశం అయితే ఉంది. ఇక డబుల్ ఇస్మార్ట్ పై వస్తున్న అనేక రకాల గాసిప్స్ ఆ సినిమాపై హైప్ అయితే తగ్గించలేదు. మరి విడుదల అనంతరం సినిమా ఆడియెన్స్ ను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News