సైలెంట్ గా సెట్స్ మీద రాజమౌళి సీక్వెల్ మూవీ.. ట్విస్ట్ ఏంటంటే..?
ఒక సినిమా సూపర్ హిట్ అయితే దాన్ని వెంటనే సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు. ఈమధ్య ట్రెండ్ మారి సినిమా ఎండింగ్ లో సీక్వెల్ ట్విస్ట్ ఇచ్చి ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేస్తున్నారు
ఒక సినిమా సూపర్ హిట్ అయితే దాన్ని వెంటనే సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు. ఈమధ్య ట్రెండ్ మారి సినిమా ఎండింగ్ లో సీక్వెల్ ట్విస్ట్ ఇచ్చి ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేస్తున్నారు. మరికొంతమంది దర్శకులు ఎప్పుడో సూపర్ హిట్ అయిన సినిమాల సీక్వెల్ ని ఇప్పుడు ప్లాన్ చేస్తున్నారు. ఏం చేసినా ఎలా చేసినా ఆడియన్స్ ని మెప్పించాలనే ప్రయత్నంలో మేకర్స్ తమ ప్రయత్నాలు మాత్రం ఆపట్లేదు. ఐతే విచిత్రంగా తెలుగులో సూపర్ హిట్ అయిన ఒక సినిమా హిందీలో రీమేక్ కాగా అక్కడ హిట్ అయ్యింది.
ఐతే ఇప్పుడు ఆ సినిమా సీక్వెల్ మొదలు పెట్టారు. ఐతే ఆ సీక్వెల్ కు తెలుగు సినిమాకు సంబంధం లేదు. ఇంతకీ తెలుగు సినిమా రీమేకై మళ్లీ ఇప్పుడు హిందీలో సీక్వెల్ గా వస్తున్న సినిమా ఏది అంటే సన్ ఆఫ్ సర్దార్ అని తెలుస్తుంది. మన దర్శక ధీరుడు రాజమౌళి సునీల్ హీరోగా తెరకెక్కిన మర్యాద రామన్న సినిమా ఇక్కడ సూపర్ హిట్ అయ్యింది. ఐతే ఈ సినిమాను సౌత్ అన్ని భాషలతో పాటుగా హిందీలో కూడా సన్ ఆఫ్ సర్దార్ గా రీమేక్ చేశారు.
2013 లో రిలీజైన సన్ ఆఫ్ సర్దార్ సినిమాను అశ్విన్ ధీర్ డైరెక్ట్ చేశారు. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ చేస్తున్నారు. సన్ ఆఫ్ సర్దార్ 2 సినిమాను విజయ్ కుమార్ అరోరా డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాను ఈ ఇయర్ జూలై 25కి రిలీజ్ లాక్ చేశారు. అజయ్ దేవగన్ హీరోగా చేస్తున్న ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ ఫిమేల్ లీడ్ గా నటిస్తుంది. ఐతే ఈ సినిమా సీక్వెల్ విషయంలో మాతృక దర్శకుడు రాజమౌళికి చెప్పారా లేదా అన్నది మాత్రం తెలియాల్సి ఉంది.
ఈ సీక్వెల్ ని సైలెంట్ గా సెట్స్ మీదకు తీసుకెళ్లారు. జనవరిలో మొదలవుతున్న ఈ సినిమా జూలై ఎండింగ్ లో రిలీజ్ ప్లాన్ చేశారు. ఒకవేళ సీక్వెల్ అక్కడ హిట్ అయితే మళ్లీ మర్యాద రామన్న 2 అని మన దగ్గర కూడా అలాంటి ఒక ప్రయత్నం చేస్తారా లేదా అన్నది చూడాలి. ఏది ఏమైనా తెలుగు సినిమా రీమేక్ ఇప్పుడు సీక్వెల్ సన్ ఆఫ్ సర్దార్ 2 ఫిలిం గోయర్స్ చర్చల్లో స్పెషల్ టాపిక్ అయ్యింది.