CK బ్యూటీ దెబ్బకు హాలీవుడ్ మతి చెడాలి
ప్రస్తుతం మెక్సికోలో ఈ వెబ్ సిరీస్ ని చిత్రీకరిస్తున్నారని సమాచారం. అయితే ఈ సిరీస్ లో తనకు ఏమేరకు గుర్తింపు ఉన్న పాత్ర దక్కింది? అన్నది వేచి చూడాలి.
జయాపజయాలతో సంబంధం లేకుండా కొందరు కథానాయికల హవా సాగుతుంది. ఫ్లాప్ లు ఉన్నా కొందరు తమదైన గ్లామర్ తో మురిపిస్తూ, అవకాశాలు కొల్లగొట్టడం చూస్తున్నదే. గ్లామరస్ బ్యూటీ దిశా పటానీ దశాబ్ధం పైగానే బాలీవుడ్ లో కెరీర్ ని సాగించింది. కెరీర్ లో ఆశించిన విజయాలేవీ లేవు.. కానీ కెరీర్ పరంగా అవకాశాలకు కొదవేమీ లేదు. ఇటీవల కల్కి 2898 ఏడి, కంగువ లాంటి చిత్రాల్లో నటించిన దిశాకు దక్కిన గుర్తింపు అంతంత మాత్రమే.
అయినా ఇప్పటికీ అవకాశాల పరంగా కొదవేమీ లేదు. ప్రస్తుతం ఓ భారీ వెబ్ సిరీస్ లో కూడా నటించేస్తోంది. హాలీవుడ్ లో అగ్ర కథానాయకులు టైరీస్ గిబ్సన్ , హ్యారీ గుడ్విన్స్ వంటి ప్రముఖులతో అవకాశం అందుకుంది. ప్రస్తుతం మెక్సికోలో ఈ వెబ్ సిరీస్ ని చిత్రీకరిస్తున్నారని సమాచారం. అయితే ఈ సిరీస్ లో తనకు ఏమేరకు గుర్తింపు ఉన్న పాత్ర దక్కింది? అన్నది వేచి చూడాలి.
అమెరికన్ సిరీస్ క్వాంటికోతో ప్రియాంక చోప్రా ఘనంగా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వరుసగా పలు యాక్షన్ చిత్రాల్లోను నటించి, ఇటీవల సిటాడెల్ ఫ్రాంఛైజీతో ఫుల్ బిజీగా ఉంది. సిటాడెట్ 2లోను నటిస్తోంది పీసీ. అయితే దిశా పటానీ తనను తాను నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఆరంగేట్ర వెబ్ సిరీస్ తోనే నటిగా మంచి పేరు తెచ్చుకుంటే అది మైలేజ్ ని పెంచుతుంది. తొలి ప్రయత్నం సఫలమైతే, అటుపై సినిమాల పరంగాను అవకాశాలు తనని వరించే అవకాశం ఉంది.
నిజానికి సిటాడెల్ బ్యూటీ ప్రియాంక చోప్రాని మించి గ్లామర్ ని ఒలకబోసే సత్తా దిశాకు ఉంది. దిశా పటానీ టోన్డ్ లుక్ హాలీవుడ్ కి మతి చెడగొట్టడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు. బాలీవుడ్ లో అలాగే దక్షిణాది పరిశ్రమల్లోను ఆశించిన విజయాలు దక్కలేదు గనుక దిశా హాలీవుడ్ లో అంది వచ్చే అవకాశాలను వదులుకునే ఛాన్సే లేదు. ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో అవకాశాలు లభిస్తే అక్కడే కొనసాగినా ఆశ్చర్యపోనవసరం లేదు. ప్రియాంక చోప్రా తర్వాత మళ్లీ ఆ స్థాయిలో హాలీవుడ్ లో క్రేజీ పాత్రల్లో నటించాలని అభిమానులు కోరుకుంటున్నారు. పీసీ, దీపిక పదుకొనే తరహాలో అదిరిపోయే బాడీ లాంగ్వేజ్ దిశా పటానీకి ఉంది. అందువల్ల పాశ్చాత్య సినిమాల్లో ఈ బ్యూటీ రాణిస్తుందని భావిస్తున్నారు. సీకే బ్యూటీ దెబ్బకు హాలీవుడ్ మతి చెడటం ఖాయమని అంచనా వేస్తున్నారు.