మక్కల్ సెల్వన్ కాఫీ దోశ, పొంగల్ పరోటా గురించి తెలుసా..?

అంతేకాదు తను చేసిన స్పెషల్ డిష్ ల గురించి చెప్పి ఆ ఇంటర్వ్యూలో పాల్గొన్న వారిని నవ్వించాడు.

Update: 2025-01-17 17:30 GMT

స్టార్స్ అంతా కూడా తెర మీద కనిపిస్తేనే అదో క్రేజ్ అనిపిస్తుంది. అలాంటి స్టార్స్ అంతా కలిసి ఒకచోట ముచ్చటిస్తే ఆ లెక్క వేరేలా ఉంటుంది. లేటేస్ట్ గా గలాటా ప్లస్ లో పాన్ ఇండియా స్టార్స్ రౌండ్ టేబుల్ 2025 స్పెషల్ చిట్ చాట్ జరిగింది. ఈ చిట్ చాట్ లో ప్రకాష్ రాజ్, అరవిద్ స్వామి, విజయ్ సేతుపతి, సిద్ధు జొన్నలగడ్డ, ఉన్ని ముకుందన్, విజయ్ వర్మ అటెండ్ అయ్యారు. ఈ ఇంటర్వ్యూలో అరవింద్ స్వామి విజయ్ సేతుపతి మాట్లాడుతున్న టైం లో ప్రకాష్ రాజ్ కి సైగ చేశరు. అప్పుడు ప్రకాష్ రాజ్ నవ్వితే నేనేం చేయలేదు ఇతనే అంటూ అరవింద్ స్వామి వైపు చూపించాడు.

ఆ టైం లో విజయ్ సేతుపతి సర్ ఇంటర్వ్యూని డిస్టర్బ్ చేస్తున్నాడు ఈయన్ను బయటకు పంపించండి అని అన్నాడు. దానికి ఆ ఇంటర్వ్యూలో పాల్గొన్న వారంతా కూడా నవ్వేశారు. అంతేకాదు తను చేసిన స్పెషల్ డిష్ ల గురించి చెప్పి ఆ ఇంటర్వ్యూలో పాల్గొన్న వారిని నవ్వించాడు. ముఖ్యంగా తాను డిఫరెంట్ కాంబినేషన్స్ తో రెసిపీస్ చేయడానికి ట్రై చేశానని. పాండిరాజ్ సినిమా షూటింగ్ టైం లో తాను నిత్యా మీనన్ తో కలిసి వాటర్ మిలెన్ పరోటా, పైనాపిల్ పరోటా, పొంగల్ పరోటా, కాఫీ దోశ ఇలాంటివి అన్ని ట్రై చేశానని అన్నాడు విజయ్ సేతుపతి.

ఈ వెరైటీ రెసిపీస్ గురించి విజయ్ సేతుపతి చెప్పడం చూసి ఆ ఇంటర్వ్యూలో పాల్గొన్న వారంతా కూడా షాక్ అయ్యారు. ఏంటి ఈ కాంబినేషన్స్ లో కూడా వంటలు చేస్తారా అని అనుకోవడం వారి వంతు అయ్యింది. మొత్తానికి గలాటా ప్లస్ పాన్ ఇండియా యాక్టర్స్ రౌండ్ టేబుల్ 2025 ఇంటర్వ్యూలో పాల్గొన్న వారందరినీ విజయ్ సేతుపతి తన కామెడీ తో అలరించారు.

ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఐతే విజయ్ సేతుపతి ప్రోమో ఇలా బయటకు వచ్చిందో లేదో అలా వైరల్ అయ్యింది. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ ఇంటర్వ్యూ గురించే చర్చిస్తున్నారు. ఆన్ స్క్రీన్ మీదే కాదు ఆఫ్ స్క్రీన్ లో కూడా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి తన మార్క్ టైమింగ్ తో అలరిస్తున్నారు. ఐతే ఈ ఇంటర్వ్యూ అంతా కూడా చాలా సరదాగా సాగినట్టు తెలుస్తుంది.

Tags:    

Similar News