సింపుల్ గా పెళ్లి చేసుకుంటే ఇలా తిడతారా?
బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా-జహీర్ ఇక్బాల్ ప్రేమ వివాహం నిరాడంబరంగా జరిగిన సంగతి తెలిసిందే.
బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా-జహీర్ ఇక్బాల్ ప్రేమ వివాహం నిరాడంబరంగా జరిగిన సంగతి తెలిసిందే. సోనాక్షి ఇంట్లోనే ఇరువురి కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో సింపుల్ గా జరిగింది. అయితే రిసెప్షెన్ అయినా గ్రాండ్ గా ఉంటుందని ప్రేక్షకాభిమానులు సహా ఇండస్ట్రీకి చెందిన వారు భావించారు. కానీ ఈ జోడీ అందుకు ఛాన్స్ ఇవ్వలేదు. సింపుల్ గా కొంత మందిని మాత్రమే పిలిచి భోజనాలు పెట్టించి పంపించింది.
అయితే సోనాక్షి ఇలా పెళ్లి చేసుకోవడంపై బాలీవుడ్ లో చాలా మంది ఫీలైనట్లు కనిపిస్తుంది. కొంతమంది బాహాటంగానే సోనాక్షి ని తిట్టినట్లు తెలుస్తోంది. సోనాక్షి స్నేహితురాలు హ్యూమా ఖురేషీ ...సోనాక్షి నుంచి పెళ్లి పార్టీలు..ఫంక్షన్లు ఆశించి భంగపడ్డానని కసుబుసు మందిట. తనని తీవ్ర నిరాశకు గురిచేసావని సోనాక్షి ముఖం మీదనే చెప్పేసిందిట నవ్వుతూ. ఇక స్టైలిస్ట్ మోహిత్ అయితే సోనాక్షిని డిజైనర్ చీరల్లో ఊహించు కుని ఊహల్లో తేలాడుట.
పెళ్లి కూతురుగా కనీసం ఓ పది డిజైనర్ చీరల్లోనైనా చూస్తానని ఆశించాడుట. కానీ ఆమె మాత్రం ఒకే చీరతో సరిపెట్టి తనని సైతం నిరుత్సాహ పరిచిందని స్నేహితుల వద్ద అంటున్నాడుట. ఇలా పెళ్లి చేసుకోవడం సోనాక్షి కుటుంబ సభ్యులకు కూడా ఏ మాత్రం ఇష్టం లేదని సోనాక్షి చెబుతుంది.
తన సోదరుడి పెళ్లికి 8వేల మంది అతిధులు వచ్చారని, ఈ నేపథ్యంలో కుమార్తె పెళ్లి కూడా తండ్రి శత్రుజ్ఞు సిన్హా భారీ ఎత్తున చేయాలని ఎన్నో కలలు కన్నాడుట. కానీ సోనాక్షి పప్పాకి ఆ ఛాన్స్ ఇవ్వలేదు. నిరాడం బర పెళ్లిని, జీవితాన్నే కోరుకుంది. తన మనసుకు నచ్చినట్లు వివాహం చేసుకుని సింపుల్ గా ఉండే వారందరి హృదయాలకు దగ్గరైంది. ఇలా ఉండటం అంత చిన్న విషయం కాదన్నది అంతా గమనించాల్సి విషయం.