కుమార్తెకు ల‌గ్జ‌రీ ప్లాట్ గిప్ట్ గానా?

తాజాగా సోనాక్షికి తండ్రి ఓ ఖ‌రీదైన ప్లాట్ ని కూడా గిప్ట్ గా బ‌హుక‌రించార‌ని బాలీవుడ్ మీడియాలో వార్త‌లొ స్తున్నాయి.

Update: 2024-06-28 02:30 GMT

సోనాక్షి సిన్హా-జ‌హీర్ ఇక్బాల్ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే కుటుంబ స‌భ్యుల సమక్షంలో ఘ‌నంగా వివాహం జ‌రిగింది. ఎలాంటి వివాదాలు లేకుండా పెద్ద‌ల్ని ఒప్పించి...మెప్పించి ఒక‌ట‌య్యారు. తొలుత ఈ వివాహం సోనాక్షి త‌ల్లిదండ్రుల‌కు ఇష్టం లేద‌ని ప్ర‌చారం సాగింది గానీ..అవ‌న్నీ త‌ప్పుడు వార్త‌ల‌న్నీ త‌ల్లిదండ్రుల ఇష్టంతో..స‌హకారంతో వివాహం చేసుకుంటున్న‌ట్లు శ‌త్రుజ్ఞు సిన్హా క్లారిటీ ఇవ్వ‌డంతో ఎలాంటి సందేహాలు లేకుండా పోయాయి.

తాజాగా సోనాక్షికి తండ్రి ఓ ఖ‌రీదైన ప్లాట్ ని కూడా గిప్ట్ గా బ‌హుక‌రించార‌ని బాలీవుడ్ మీడియాలో వార్త‌లొ స్తున్నాయి. బాంద్రా లో ఈ ప్లాట్ ఉందిట‌. దీని ధ‌ర కోట్ల ఖ‌రీదు చేస్తుంద‌ని స‌మాచారం. డాడీ గిప్ట్ తో డాట‌ర ఫుల్ ఖుషీలో ఉంటుంది. కుమార్తెపై త‌న‌కున్న ప్రేమ‌ను స‌ద‌రు తండ్రి ఇలా చాటుకున్నాడ‌ని తెలుస్తోంది. దీంతో కొత్త కాపురం ఆ ప్లాట్ మొద‌లు పెడ‌తారా? లేక జ‌హీర్ ఇంట్లో ఉమ్మ‌డి కుటుంబ స‌భ్యులుగా ఉంటారా? అన్న‌ది చూడాలి.

Read more!

ఈ పెళ్లి అంటే శ‌త్రుజ్ఞు సిన్హా కి ఇష్టం లేద‌ని వ‌చ్చిన వార్త‌ల్లో నిజం లేద‌ని ప్లాట్ గిప్ట్ గా ఇవ్వ‌డంతో మ‌రోసారి క్లారిటీ వ‌స్తుంది. మ‌రి ఇందులో నిజ‌మెంతో తెలియాలి. అయితే సోనాక్షి వివాహానికి అన్న‌య్య‌లిద్ద‌రు హాజ‌రు కాని సంగ‌తి తెలిసిందే. వాళ్లిద్ద‌రికీ వివాహం ఇష్టం లేద‌ని , ఆ కార‌ణంగా పెళ్లికి రాలేద‌ని వార్త‌లొ చ్చాయి. పెళ్లి గురించి కూడా పెద్ద‌న్న‌య్య కాస్త దురుసుగానే మాట్లాడిన‌ట్లు నెట్టింట ప్ర‌చారం సాగింది. మరి ఆ అన్న‌య్య మ‌న‌సు ఎప్పుడు క‌రుగుతుందో చూడాలి.

ఇక న‌టిగా సోనాక్షి కెరీర్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఇండ‌స్ట్రీలో తండ్రి వార‌సత్వాన్ని కొన‌సాగి స్తుంద‌ని చెప్పొచ్చు. ఆయ‌న రిటైర్మెంట్ త‌ర్వాత సోనాక్షి స‌క్సెస్ అవ్వ‌డం ప‌ట్ల తండ్రి ఎన్నో సంద ర్భాల్లో సంతోషాన్ని వ్య‌క్తం చేసారు. కుమార్తె అంటే శ‌త్రుజ్ఞు సిన్హాకి అంత ఇష్టం.

Tags:    

Similar News