జాదూగాళ్ సోనారిక సిమసిమలు
ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ లో దూకుడు పెంచిన సోనారిక హాటెస్ట్ ఫోటోషూట్లతో విరుచుకుపడుతోంది.
జాదుగాడు చిత్రంతో తెరకు పరిచయమైంది ఉత్తరాది బ్యూటీ సోనారిక బదోరియా. నాగశౌర్య సరసన నటించిన ఈ బ్యూటీ ఆరంభం గ్లామర్ షోకి వెనకాడలేదు. బెల్లంకొండ `స్పీడున్నోడు`లోనూ సోనారికా నటించింది. `ఈడోరకం ఆడోరకం`తో మంచు కాంపౌండ్ లో అడుగుపెట్టింది. ఆ తర్వాత బాలీవుడ్ లో సాన్ సీన్ అనే చిత్రంలో నటించింది. ఇంద్రజిత్ అనే తమిళ చిత్రంలోనూ నాయికగా నటించింది. కానీ సౌత్ లో ఈ బ్యూటీకి సరైన లక్ చిక్కలేదు. అవసరమైన విజయం దక్కలేదు. చివరికి టీవీ సీరియళ్లతో బిజీ అయింది. హిందీలో హరహర మహదేవ్ సీరియల్ తో సోనారిక నటిగా మంచి పేరు తెచ్చుకుంది. ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ లో దూకుడు పెంచిన సోనారిక హాటెస్ట్ ఫోటోషూట్లతో విరుచుకుపడుతోంది.
ప్రస్తుతం ఓటీటీలోను ఈ భామ అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది. మధ్యతరగతి నుండి వచ్చిన ఈ బ్యూటీ ఒకటిన్నర దశాబ్ధాల పాటు ప్రయత్నాలను కొనసాగించింది. వెబ్ సిరీస్ లు, సినిమాల జోన్‌లోకి ప్రవేశించడానికి టీవీ నుండి విరామం తీసుకున్న ఈ బ్యూటీ ఇటీవల పలువురు దర్శకనిర్మాతలతోను మంతనాలు సాగిస్తున్నానని తెలిపింది.
మరోవైపు సోనారిక సోనారిక సోషల్ మీడియాల్లోను స్పెషల్ ఫోటోషూట్లతో విరుచుకుపడుతోంది. తాజాగా బికినీలో నదిలో స్నానానికి వెళుతున్న ఫోటోలు అంతర్జాలంలో వైరల్ అయ్యాయి. అక్కడ సూర్యాస్తమయం వేళ సోనారిక నీటిలో జలకాలాటలకు వెళుతోంది. ఈ అందమైన ఫోటోలు ఇప్పుడు అంతర్జాలంలో వైరల్ గా మారుతున్నాయి.
ఇతర విషయాలు టచ్ చేస్తే... సోనారిక స్లైస్-ఆఫ్-లైఫ్ OTT సిరీస్ `నో కిడ్డింగ్`లో నటించిన సోనారిక కరణ్ (రజ్దాన్) సర్ చిత్రం హిందుత్వ చిత్రంలోను నటించింది. లక్నో బ్యూటీ సోనారికకు బిజనెస్ మేన్ వికాష్ పరషార్ తో ఇంతకుముందు నిశ్చితార్థమైంది. ఈ జంట ఫోటోలు కూడా అంతర్జాలంలో వైరల్ అయ్యాయి. అయితే పెళ్లి గురించిన ఎలాంటి అప్ డేట్ లేదు.