సాంగ్ లీక్స్​.. పాపం తమన్​కే ఎందుకిలా?

వాస్తవానికి ఓ పాట గురించి ఏ హీరో ఫ్యాన్స్ వేయిట్ చేయని రేంజ్​లో గుంటూరు కారం ఫస్ట్ సింగిల్ కోసం మహేశ్ అభిమానులు ఎదురు చూశారు.

Update: 2023-11-04 05:55 GMT

ఎన్ని అడ్డంకులు వేయాలని ప్రయత్నిస్తున్నా లీకులు మాత్రం ఆగట్లేదు. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాల విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఎవరూ ఆపలేకపోతున్నారు. ఒరిజినల్ రిలీజ్ కన్నా ముందే అవి లీకేజీ రాయుళ్ల చేతికి చిక్కి.. సోషల్​ మీడియాలో దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్​ తమన్​ కంపోజ్ చేస్తున్న సాంగ్సే లీక్ బారిన ఎక్కువగా పడటం గమనార్హం.

ఈ మధ్య గమనిస్తే.. తమన్​ సాంగ్సే ఎక్కువగా లీక్ అవుతున్నాయి. గేమ్​ ఛేంజర్​ ఫస్ట్​ సింగిల్​ 'జరగండి జరగండి' సెడెన్​గా సోషల్ మీడియాలో కనిపించి అందర్నీ షాక్​కు గురిచేసింది. దీంతో దిల్​ రాజ్​ టీమ్ లీగల్ యాక్షన్ తీసుకుంటామని చెప్పి.. పాటను అఫీషియల్ రిలీజ్​కు ప్లాన్ చేసింది.

ఇప్పుడు గుంటూరు కారం విషయంలోనూ ఇదే ఎదురైంది. వాస్తవానికి ఓ పాట గురించి ఏ హీరో ఫ్యాన్స్ వేయిట్ చేయని రేంజ్​లో గుంటూరు కారం ఫస్ట్ సింగిల్ కోసం మహేశ్ అభిమానులు ఎదురు చూశారు. దీంతో అన్ని నెలల నిరీక్షణకు తెరదించుకూ రిలీజ్​కు రెడీ అయిన మేకర్స్​కు ఇప్పుడు సడెన్ షాక్ తగిలింది. తమన్ కంపోజ్​ చేసిన పాటకు సంబంధించి ఓ అడియో క్లిప్ లీక్ అయింది.

సోషల్ మీడియాలో.. 'ఎదురొచ్చేగాలి..ఎగరేస్తున్నా చొక్కాపై గుండీ..' అంటూ మొదలై.. బిరియానీ, అరకోడి..మసాలా లాంటి మాస్ పదాలతో చక్కర్లు కొట్టేస్తోంది. అయితే ఇది జస్ట్​ ట్రాక్ బిట్ తప్ప.. ఫుల్​ క్వాలిటీ వెర్షన్ కాదని చెబుతున్నారు. సరే ఏదేమైనా.. దీన్ని కో ఇన్సిడెన్స్​ అనాలో ఇంకేమనాలో తెలీదు కానీ.. పాపం తమన్​ అందించే సాంగ్సే ప్రస్తుతం ఇలా లీక్ అవ్వడం ఆయనకు నిరాశనే చెప్పాలి.

నిజానికి తమన్​.. రామ్​ చరణ్​ గేమ్​ ఛేంజర్​ లీక్​ అవ్వగానే ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ ఇప్పుడు గుంటూరు కారం లీక్​ను ఆపలేకపోయారు. అంతకుముందు మహేశ్​ సర్కారు వారి పాట చిత్రంలోనూ కళావతి సాంగ్ లీకేజ్ రాయుళ్ల చేతికి చిక్కిన సంగతి తెలిసిందే. దీనికి కూడా తమనే మ్యూజిక్ అందించారు.

Tags:    

Similar News