పుష్ప 2 టికెట్ వేలం.. గవర్నమెంట్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా?
పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలతో విడుదలకు సిద్ధమవుతున్న పుష్ప 2: ది రూల్ పై ఇప్పటికే భారీ బజ్ క్రియేట్ అయింది.
పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలతో విడుదలకు సిద్ధమవుతున్న పుష్ప 2: ది రూల్ పై ఇప్పటికే భారీ బజ్ క్రియేట్ అయింది. అల్లు అర్జున్ క్రేజ్, సుకుమార్ మేకింగ్ స్టైల్, మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడక్షన్ విలువలతో సినిమా ప్రేక్షకుల మదిలో ఉన్న అంచనాలను ఆకాశానికే ఎత్తుతోంది. దానికి తోడు రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ మరింత ఎక్కువ స్థాయిలో నమ్మకాన్ని కలిగించింది. దీంతో హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలి అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ నేపథ్యంలో సినిమా తొలి రోజున మరింత క్రేజ్ పెంచడానికి మైత్రీ మూవీ మేకర్స్ ఓ వినూత్న ఆలోచన చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అదే, పుష్ప 2 విడుదలైన ప్రతి థియేటర్‌లో తొలి టికెట్‌ను వేలం ద్వారా విక్రయించడం. ఈ విధానం ప్రకారం, ఎవరు ఎక్కువ మొత్తానికి టికెట్ కొనుగోలు చేస్తారో, వారికి ఆ థియేటర్‌లో తొలి టికెట్ అందజేస్తారు. అంతేకాక, వేలం ద్వారా వచ్చిన వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరచి పారదర్శకతను కొనసాగిస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఈ తరహా ప్లాన్ సినిమా బజ్‌ను మరింత పెంచడంతో పాటు, ఫస్ట్ డే కలెక్షన్లను మరో లెవెల్ కు తీసుకు వెళ్లే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఈ విధానం అమలు చేసేందుకు కొన్ని కీలక సందేహాలు హైలెట్ అవుతున్నాయి. సాధారణంగా సినిమా టికెట్ రేట్లను గవర్నమెంట్ నియంత్రణలో ఉంచుతుంది. ప్రభుత్వ విధానాల ప్రకారం, ప్రతి థియేటర్‌లో టికెట్ ధరలు నిర్దిష్టంగా నిర్ణయించబడతాయి. ఒకవేళ వేలం పద్ధతిని తీసుకురావాలనుకుంటే, దీని కోసం ప్రత్యేక అనుమతులు కావాలి.
వేలం ద్వారా టికెట్లు విక్రయించడం వల్ల ఎక్కువ ధరలకు టికెట్లు అమ్మడం జరుగుతుంది. ఇది ప్రేక్షకులపై ఆర్థిక భారం పెంచుతుందనే విమర్శలు ఎదురవచ్చు. అలాగే, గవర్నమెంట్ నుంచి క్లియర్‌గా పర్మిషన్ అందకపోతే, ఈ ప్రతిపాదన ముందుకు వెళ్లడం కష్టమే. పుష్ప 2 వంటి భారీ క్రేజ్ ఉన్న సినిమాకు ఈ ఐడియా అమలు చేస్తే, ప్రేక్షకుల్లో మరింత ఉత్సాహం కలిగించే అవకాశం ఉంది. కానీ రూల్స్ ఎలా ఉంటాయో దాన్ని బట్టి నడుచుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది.
అయితే థియేటర్లలో ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్ అందుకోవడం సినీ అభిమానులకు గౌరవం కాబట్టి, ఈ ఐడియా పెద్ద విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. ఇక మైత్రీ మూవీ మేకర్స్ వినూత్న ఆలోచన ఎంతవరకు అమలవుతుందనేది గవర్నమెంట్ ఆమోదంపై ఆధారపడి ఉంటుంది. అయితే, ఈ ప్రతిపాదనపై అధికారిక ప్రకటన వచ్చే వరకు ప్రేక్షకులు ఆసక్తిగా వేచిచూడాల్సిందే. పుష్పరాజ్ మేనియా ఇంకా ఎంత మేరకు విస్తరిస్తుందో చూడాలి.