కంటెంట్ క్రియేటర్ నెల ఆదాయం 30 కోట్లు!
సోషల్ మీడియా, యూట్యూబ్‌లో కోట్లాది రూపాయల ఆదాయం ఆర్జిస్తూ కొందరు కంటెంట్ క్రియేటర్లు, ఇన్ ఫ్లూయెన్సర్లు ఆశ్చర్యపరుస్తున్నారు.
సోషల్ మీడియా, యూట్యూబ్‌లో కోట్లాది రూపాయల ఆదాయం ఆర్జిస్తూ కొందరు కంటెంట్ క్రియేటర్లు, ఇన్ ఫ్లూయెన్సర్లు ఆశ్చర్యపరుస్తున్నారు. అడల్ట్ నటి సోఫీ రెయిన్ తాను 30 కోట్లు (43 మిలియన్ డాలర్లు) సంపాదించినట్లు వెల్లడించడం ద్వారా ఇంటర్నెట్ ని షేక్ చేసింది. `ఓన్లీ ఫ్యాన్స్` అడల్ట్ యాప్ ద్వారా ఇంత పెద్ద మొత్తాన్ని ఆర్జించానని సోఫీ తెలిపింది.
ఫ్లోరిడాకు చెందిన ఇన్‌ఫ్లుయెన్సర్ సోఫీ నిన్న Xలో తన సంపాదన స్క్రీన్‌షాట్‌ను షేర్ చేసింది, గత సంవత్సరంలోనే ఈ భామ 43.4 మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసింది. సోఫీ రెయిన్ ఓన్లీ ఫ్యాన్స్ ఖాతాల నుంచి నెలకు 4 మిలియన్ల డాలర్లకు పైగా సంపాదిస్తుంది.
ఓన్లీ ఫ్యాన్స్ ఆదాయాల పేజీ స్క్రీన్‌షాట్‌ను షేర్ చేస్తూ ఈ వివరాలను వెల్లడించింది. ఓన్లీ ఫ్యాన్స్ యాప్ ద్వారా ఆమె స్థూల సంపాదన 43,477,695 (రూ.367 కోట్లకు పైగా) డాలర్లు ఉంది. సోఫీ రెయిన్ ఇటీవలి ఇంటర్వ్యూలో ఆమె సంపాదించే డబ్బు గురించి చెప్పింది. క్రియేటర్‌లు తమ ఫాలోవర్‌ల ద్వారా నేరుగా తమ కంటెంట్‌ను మానిటైజ్ చేసుకోవడానికి అనుమతించే సబ్‌స్క్రిప్షన్ ఆధారిత కంటెంట్ ప్లాట్‌ఫారమ్ అయిన ఓన్లీ ఫ్యాన్స్‌లో నెలకు సుమారుగా 4 మిలియన్ల (రూ.33 కోట్లు) డాలర్లు సంపాదిస్తున్నట్లు ఆమె వెల్లడించింది. అభిమానులు, సబ్‌స్క్రైబర్‌ల కోసం ప్రత్యేకమైన కంటెంట్ షేర్ చేయడం ద్వారా డబ్బు సంపాదించే విధానం ఇది.
సోఫీ రెయిన్ ఎవరు? సోఫీ రెయిన్ ఒక అమెరికన్ కంటెంట్ క్రియేటర్.. మోడల్. ఆమె ఓన్లీ ఫ్యాన్స్ ద్వారా పాపులరైంది. ఏప్రిల్ 2023లో సోఫీ తన సోదరి సియెర్రాతో కలిసి కంటెంట్‌ని సృష్టించడం ప్రారంభించింది. ది సన్ వివరాల ప్రకారం.. ఆమెకు ఓన్లీ ఫ్యాన్స్‌లో 11 మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్లు .. ఇన్‌స్టాగ్రామ్‌లో 5 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. సోఫీ శ్రామిక తరగతి కుటుంబంలో పేద అమ్మాయిగా పెరిగిందని, 17 ఏళ్లు వచ్చేసరికి డబ్బు సంపాదించడానికి కనీస వేతన సేవకురాలిగా పనిచేసిందని మీడియా కథనాలు వెలువడ్డాయి.
నా కుటుంబం చాలా పేదరికంలో పెరిగింది.. తిండికి లాటరీ కొట్టాము! అని తెలిపింది. నా తల్లిదండ్రులు నాకు మద్దతు ఇచ్చారు.. కష్టపడి పనిచేశారు.. కానీ మేము విలాసాలను పొందలేకపోయాము. మేము చాలా కష్టంలో ఉన్నాం.. నేను రెస్టారెంట్‌లో 17 సంవత్సరాల వయస్సులో ఉద్యోగంలో చేరాను అని తెలిపింది.
నేను ఇన్‌ఫ్లుయెన్సర్ అవుతానని ఎప్పుడూ అనుకోలేదు. నేను ఇంకా ఈ కల నుండి మేల్కొనడానికి వేచి ఉన్నాను.. అని ఎమోషనల్ అయింది. ఓన్లీ ఫ్యాన్స్‌లో వీడియోలు పోస్ట్ చేయడం ప్రారంభించాలనే నిర్ణయం సోఫీకి సంపద ను,పేరును తెచ్చిపెట్టింది. ఆమె సంపాదనతో తల్లిదండ్రుల రుణాన్ని తీర్చగలుగుతోంది. తన తల్లిదండ్రుల అప్పులను తానే తీర్చేస్తున్నానని సోఫీ తెలిపింది.