సౌందర్య సూపర్ హాట్ సెన్షేషన్!
తాజాగా అమ్మడు మరో న్యూ ఎరైవల్ లో తళుకులీనింది. ఇదిగో ఇక్కడిలా నలుపు వర్ణం డిజైనర్ లో ఆకర్షణీయంగా ముస్తాబైంది. ఆల్ట్రా మోడ్రన్ దుస్తుల్లో అగ్గిరాజేస్తుంది.
ఇటీవల వెబ్ సిరీస్ ల క్వీన్ గా వెలిగిపోతున్న సౌందర్య శర్మ సుపరిచితమే. దిల్లీ డాక్టర్ల కుటుంబం నుంచి వచ్చిన ఈ బ్యూటీ బాలీవుడ్ కలల్ని నిజం చేసుకుని స్టార్ గా దూసుకుపోతోంది. ఇదే హుషారులో ఇలా ఇన్ స్టా వేదికగా ఫోటోషూట్లతో దుమారం రేపుతోంది. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటోలతో కుర్రాళ్ల హృదయాల్ని ఛిద్రం చేస్తుంది.
తాజాగా అమ్మడు మరో న్యూ ఎరైవల్ లో తళుకులీనింది. ఇదిగో ఇక్కడిలా నలుపు వర్ణం డిజైనర్ లో ఆకర్షణీయంగా ముస్తాబైంది. ఆల్ట్రా మోడ్రన్ దుస్తుల్లో అగ్గిరాజేస్తుంది. అమ్మడు స్కిన్ షో డిజైనర్ లో హైలైట్ అవుతుంది. వివిధ భంగిమల్లో కెమెరాకి ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. చూసి తరించడం సౌందర్య అభిమానులు వంత్తైంది.
సౌందర్య శర్మ.. 2017 లో 'రాంచీ డైరీస్' తో హిందీ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. మూడేళ్ల తరువాత ఆమె రక్తంచల్ అనే క్రైమ్ డ్రామాతో వెబ్ ప్రపంచంలోకి ప్రవేశించింది. సౌందర్య ఆకర్షణీయమైన ఇమేజ్ నుంచి దూరమై ఈ ప్రాజెక్టులలో కాస్త క్లిష్టమైన పాత్రలను పోషించారు. అయితే ఇది అనూహ్యమైన ఎంపిక అని సౌందర్య శర్మ అంటుంది. హాలీవుడ్ లో జూలియా రాబర్ట్స్ అత్యంత ఆకర్షణీయమైన స్టార్ ని అంటూ హొయలు పోయింది సౌందర్య.
ప్రస్తుతం అమ్మడు కొత్త ప్రాజెక్ట్ ల కోసం ఎదురు చూస్తుంది. ఓ బిగ్ స్టార్ సరసన ఛాన్స్ రాకపోతుందా? నటించకపోనా? అన్న కాన్పిడెంట్ అమ్మడి మాటల్లో బలంగా ఉంది. అలాంటి ఛాన్స్ వస్తే తానేంటో నిరూపిస్తాను అంటోంది. అయితే ప్రస్తుతానికి అమ్మడి చేతిలో మ్యూజిక్ ఆల్బమ్స్ తప్ప సినిమాలు లేవు.