మోడ్రన్ టచ్ తో స్రవంతి కనికట్టు

బయటకొచ్చాక రెగ్యులర్ గా తన ఇన్ స్టాగ్రామ్ లో గ్లామర్ ఫోటోషూట్ లని షేర్ చేస్తూ స్రవంతి హాట్ బ్యూటీగా మారిపోయింది.

Update: 2024-08-18 04:42 GMT

తెలుగు నాట గ్లామర్ యాంకర్స్ గా దూసుకుపోతున్న అందాల భామలతో స్రవంతి చొక్కారవు ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది. ఈ బ్యూటీ యాంకర్ సుమ తర్వాత అత్యధికంగా సినిమా ఈవెంట్స్ కి హోస్ట్ గా చేసేలా అడుగులు వేస్తోంది. యుట్యూబ్ లో న్యూస్ యాంకర్ గా కెరియర్ స్టార్ట్ చేసిన స్రవంతి తన అందంతో అందరిని ఆకట్టుకుంది. ఇంటర్వ్యూలు చేస్తూ పాపులర్ అయ్యింది. దీంతో బిగ్ బాస్ తెలుగు రియాలిటీషోలో పాల్గొనే ఛాన్స్ అందుకుంది.

 

బిగ్ బాస్ షోలో టాప్ 5 కంటిస్టెంట్ లలో ఒకరుగా స్రవంతి నిలిచింది. ఆ షోతో స్రవంతికి మంచి క్రేజ్ వచ్చింది. బయటకొచ్చాక రెగ్యులర్ గా తన ఇన్ స్టాగ్రామ్ లో గ్లామర్ ఫోటోషూట్ లని షేర్ చేస్తూ స్రవంతి హాట్ బ్యూటీగా మారిపోయింది. అదిరిపోయే అందంగా పాటు ఆకర్షించే మాటలతో స్రవంతి యాంకర్ గా మంచి ఇమేజ్ తెచ్చుకుంది. దీంతో సినిమా వేడుకలకి, కార్పొరేట్ ఈవెంట్స్ కి హోస్ట్ గా వ్యవహరిస్తోంది.

 

ప్రస్తుతం మోస్ట్ బిజియస్ట్ హోస్ట్ గా స్రవంతి చొక్కారపు దూసుకుపోతోంది. బుల్లితెరపై యాంకర్ అంటే చాలా మంది కనిపిస్తారు. కానీ సినిమా వేడుకలు, కార్పొరేట్ ఈవెంట్స్ ని లైవ్ లో ఉంటూ హోస్ట్ చేయడం అంటే చాలా చాలెంజింగ్ టాస్క్ అని చెప్పాలి. అందులో స్రవంతి సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతోంది. ఇన్ స్టాగ్రామ్ లో కూడా ఈ బ్యూటీ చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా తన గ్లామర్ ఫోటోలని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ఉంటుంది.

 

తాజాగా ఈ అమ్మడు బెంగుళూరులో ఏదో ఈవెంట్ కోసం వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడ దిగిన ఫోటోలని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. కన్నడంలో అందరికి నమస్కారం అంటూ పోస్ట్ పెట్టింది. ఇక ఈ ఫోటోలలో మోడ్రన్ టచ్ జీన్ ప్యాంట్ షర్టుతో స్టైలిష్ గా స్రవంతి కనిపిస్తోంది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. స్రవంతి ఈ లుక్ లో చాలా అందంగా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Tags:    

Similar News