సైఫ్ కొడుకుతో శ్రీలీల.. భయపెట్టే ప్లానే..

మ్యాడ్ డాక్ ఫిలిమ్స్ ప్రస్తుతం హారర్ థ్రిల్లర్ కాన్సెప్ట్ లతో కొత్త తరహా సినిమాలను లైన్ లో పెట్టింది. 8 వరకు హారర్ కథలు ఉండడం విశేషం.

Update: 2025-01-07 13:21 GMT

బాలీవుడ్‌లో ఈ మధ్య ఇబ్రహీం అలీ ఖాన్ పేరు గట్టిగానే వైరల్ అవుతోంది. సైఫ్ అలీ ఖాన్ కుమారుడిగా బాలీవుడ్‌లోకి అడుగు పెట్టబోతున్న ఇబ్రహీం, రీసెంట్ గా టాలీవుడ్ బ్యూటీ శ్రీలీలతో కలసి ముంబై మ్యాడాక్ ఫిలిమ్స్ ఆఫీస్ వద్ద కనిపించడంతో కొత్త చర్చలకు తెర లేపారు. ఈ ఇద్దరు తమ కాజువల్ లుక్‌తో ముంబై ఫోటోగ్రాఫర్లను తెగ ఎట్రాక్ట్ చేశారు. ప్రత్యేకంగా ఇబ్రహీం ఆకర్షణీయమైన అవుట్‌ఫిట్, శ్రీలీల డెనిమ్ లుక్ అందరినీ ఆకట్టుకున్నాయి.

ఇబ్రహీం అలీ ఖాన్ ఇప్పటికే తన డెబ్యూ చిత్రంపై దృష్టి పెట్టగా, శ్రీలీల కూడా తన బిజీ షెడ్యూల్‌కి మధ్య బాలీవుడ్ ప్రయాణం మొదలుపెట్టే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది. శ్రీలీల ప్రస్తుతం పలు పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఆమె నటించిన 'రాబిన్ హుడ్' సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ ప్రాజెక్టుతో పాటు మరో పెద్ద ప్రాజెక్ట్‌లో భాగం కావాలని బాలీవుడ్‌లో చర్చ జరుగుతోంది.

ఇతర నటీనటులతో పోల్చితే ఇబ్రహీం, శ్రీలీల కలయిక ఎంతో ప్రత్యేకంగా అనిపిస్తోంది. వీరిద్దరూ త్వరలో ఒక భారీ ప్రాజెక్ట్ కోసం కలిసి పనిచేయబోతున్నట్లు బాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. స్త్రీ 2తో ఇటీవల మంచి లాభాలను అందుకున్న మ్యాడాక్ ఫిలిమ్స్ ఆఫీస్ వద్ద వీరి కనిపించడంతో కొత్త కథలో కనిపించనున్నట్లు అనిపిస్తుంది. ఈ కొత్త జంట వెండితెరపై ఎలా కనిపించబోతుందో చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మ్యాడ్ డాక్ ఫిలిమ్స్ ప్రస్తుతం హారర్ థ్రిల్లర్ కాన్సెప్ట్ లతో కొత్త తరహా సినిమాలను లైన్ లో పెట్టింది. 8 వరకు హారర్ కథలు ఉండడం విశేషం. ముందుగా 2025లో ‘థమ’, ‘శక్తి షాలిని’ అనే సినిమాలని తీసుకొని రాబోతున్నారు. 2026లో ‘భేడియా 2’, ‘చాముండ’ సినిమాలు రానున్నాయి. ఇక 2027లో ‘స్త్రీ 3’, ‘మహా ముంజ్య’, 2028లో ‘పెహలా మహాయోధ్’, ‘దూస్రా మహాయోధ్’ సినిమాలని తీసుకురానున్నట్లు క్లారిటీ ఇచ్చారు.

అన్ని కూడా హర్రర్ థ్రిల్లర్ జోనర్ లోనే తెరకెక్కబోతున్నాయి. దీంతో శ్రీలీల ఇబ్రహీం ఏ సినిమాలో నటించబోతున్నారు అనేది వేచి చూడాలి. మ్యాడ్ డాక్ ఫిలిమ్స్ వారికి ఈ హర్రర్ ఫ్రాంచైజ్ బాగా వర్క్ అవుట్ అవుతోంది. కాబట్టి ఈ ఇద్దరికి బెస్ట్ హిట్ వచ్చే అవకాశం ఉంటుంది. త్వరలో వీరి ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇంతవరకు శ్రీలీల టాలీవుడ్‌లో పలు విజయాలు సాధించగా, ఇబ్రహీం బాలీవుడ్‌లో తన స్థానాన్ని ఎలా సెట్ చేసుకుంటాడో చూడాలి.

Tags:    

Similar News