వాళ్లిప్పుడు మెగాస్టార్..సూప‌ర్ స్టార్లు అంటే కుద‌ర‌దు!

వాళ్లెవ్వ‌రు ఇప్పుడు మ‌ల‌యాళ ప‌రిశ్ర‌మ‌ని ఇక‌పై నియంత్రిచలేర‌ని వ్యాఖ్యానించారు.

Update: 2024-09-05 12:30 GMT

మ‌ల‌యాళం ఇండ‌స్ట్రీని జ‌స్టిస్ హేమ క‌మిటీ నివేదిక షేక్ చేస్తోన్న వేళ ప్ర‌ముఖ‌ సీనియ‌ర్ ర‌చ‌యిత‌, ద‌ర్శ‌కుడు శ్రీకుమార‌న్ థంపీ అక్క‌డ స్టార్ హీరోల‌ను ఉద్దేశించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసారు. త‌న పేరుతో నెల‌కొల్పిన అవార్డును మోహ‌న్ లాల్ కి అందించిన రెండు రోజుల అనంత‌రం ఈ వ్యాఖ్య‌లు చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోల ఆధిప‌త్యానికి కాలం చెల్లింద‌న్నారు.

వాళ్లెవ్వ‌రు ఇప్పుడు మ‌ల‌యాళ ప‌రిశ్ర‌మ‌ని ఇక‌పై నియంత్రిచలేర‌ని వ్యాఖ్యానించారు. భార‌తీయ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో మమ్ముట్టి, మోహన్‌లాల్ గొప్ప నటులు. కానీ వారు చిత్ర పరిశ్రమను నియంత్రించలేరన్నారు. నేను తీసిన ‘యువజనోల్సవమ్’తో మోహన్‌లాల్‌ పేరు సంపాదించుకున్నాడు. కానీ ఆ త‌ర్వాత నాకు డేట్లు ఇవ్వ‌డం మానేసాడు. ‘సూపర్‌స్టార్లు’, ‘మెగాస్టార్లు’ అనేవి గతంలో లేవు. వీరిద్దరి కోసమే ఆ ముద్రలు తయారు చేశారు. మమ్ముట్టి కూడా నా సినిమా ‘మున్నేటమ్’లో నటించాడు. ఆ తర్వాత అతడి స్థానాన్ని రథీశ్‌తో భర్తీ చేశాను.

అప్పటి వరకూ విన‌యంతో ఉన్న మమ్ముట్టి ఆ తర్వాత మారిపోయాడు. ఓ సినిమాకు పాటలు రాయాల్సి ఉండగా ఆ మూవీ నుంచి తప్పించేందుకు ప్రయత్నించాడు. నన్ను తప్పించే విషయంలో సురేశ్ గోపీ కూడా కీలక పాత్ర పోషించాడు. జాతీయ అవార్డుల కమిటీలో నేను స‌భ్యుడిని. దీంతో మమ్ముట్టి, మోహన్ లాల్‌కు అవార్డుల కోసం ప్రతిపాదించాను. నా వ్యక్తిగత అభిప్రాయాల‌ను ఎప్పుడూ నిర్ణయాలపై రుద్ద‌లేదు.

ప్రదర్శనపై ఎప్పుడూ ప్రభావం చూపించకుండా జాగ్రత్త పడ్డాను. మోహన్‌లాల్‌కు అవార్డు ఇవ్వాలని నా ఫౌండేషన్ ప్రతిపాదించినప్పుడు కూడా నేను వ్య‌తిరేకింలేదు. 23 సినిమాలు నిర్మించినప్పటికీ నేను పెద్ద‌ ధనవంతుడినేమీ కాదు` అన్నారు. ఇప్పుడీ వ్యాఖ్య‌లు నెట్టింట సంచ‌ల‌నంగా మారాయి.

Tags:    

Similar News