శ్రీలీల.. ఘాటైన లుక్కులో హై గ్లామర్ డోస్

తాజాగా ఈ అమ్మడు వైట్ కలర్ స్కర్ట్ లో క్యూట్ లుక్స్ తో ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Update: 2025-01-26 11:30 GMT

సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ గా వరుస సినిమాలతో దూసుకుపోతున్న ముద్దుగుమ్మ శ్రీలీల. ఈ అమ్మడు గత ఏడాది ‘పుష్ప 2’లోని దెబ్బలు పడతాయ్ సాంగ్ తో దేశ వ్యాప్తంగా విశేషమైన పాపులారిటీ సొంతం చేసుకుంది. ఈ సాంగ్ తర్వాత అమ్మడికి నార్త్ లో కూడా క్రేజ్ పెరిగింది. దీంతో హిందీలో హీరోయిన్ గా ఓ క్రేజ్ ప్రాజెక్ట్ కి సైన్ చేసింది. రీసెంట్ గా ఈ విషయాన్ని మేకర్స్ ధృవీకరించారు.

 

బాలీవుడ్ యంగ్ స్టార్ హీరో కార్తీక్ ఆర్యన్ కి జోడీగా శ్రీలీల ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. దీంతో పాటు శ్రీలీల కోలీవుడ్ లోకి కూడా అడుగుపెడుతోంది. శివ కార్తికేయన్ కి జోడీగా ఆమె కోలీవుడ్ అరంగేట్రం చేస్తోంది. సుధా కొంగర దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. రీసెంట్ గా ఈ మూవీ ప్రారంభోత్సవం జరిగింది.

 

తెలుగులో క్రేజీ హీరోయిన్ గా స్టార్ హీరోల ఫస్ట్ ఛాయస్ గా మారిపోయిన శ్రీలీల ఇప్పుడు కోలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలలోకి కూడా అడుగుపెట్టడం ద్వారా పాన్ ఇండియా హీరోయిన్ ఇమేజ్ వైపు దూసుకుపోతోంది. ఇదిలా ఉంటే ఆమె నితిన్ కి జోడీగా చేసిన ‘రాబిన్ హుడ్’ రిలీజ్ కి రెడీ అవుతోంది. అలాగే శ్రీలీల సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.

 

రెగ్యులర్ గా తన అప్డేట్స్ ని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తుంది. రష్మిక తర్వాత యూత్ క్రష్ గా మారిపోయిన శ్రీలీల ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆమె డాన్స్, పెర్ఫార్మెన్స్, అందానికి చాలా మంది యువత ఫ్యాన్స్ గా మారిపోతున్నారు. ప్రస్తుతం తెలుగులో బెస్ట్ డాన్స్ చేసే హీరోయిన్స్ లలో సాయి పల్లవితో సమానమైన ఇమేజ్ గుర్తింపుని శ్రీలీల అందుకుంది.

ఇక శ్రీలీల గ్లామర్ రోల్స్ కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో స్టార్ హీరోలకి జోడీగా ఛాన్స్ లు అందుకుంటుంది. తాజాగా ఈ అమ్మడు వైట్ కలర్ స్కర్ట్ లో క్యూట్ లుక్స్ తో ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్లీవ్ లెస్ గా ఉన్న ఈ స్కర్ట్ లో శ్రీలీల చాలా గ్లామరస్ గా ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News