ఐటం పాటల్లో శ్రీలీల..కిసిక్ బ్యూటీ కండీషన్ అప్లై!
కిసిక్ పాటతో శ్రీలీల పాన్ ఇండియాలో ఎంత ఫేమస్ అయిందో చెప్పాల్సిన పనిలేదు. ఒక్క పాట అమ్మడిని రాత్రికి రాత్రే ఫేమస్ చేసింది.;

కిసిక్ పాటతో శ్రీలీల పాన్ ఇండియాలో ఎంత ఫేమస్ అయిందో చెప్పాల్సిన పనిలేదు. ఒక్క పాట అమ్మడిని రాత్రికి రాత్రే ఫేమస్ చేసింది. ఎంతో మంది భామలున్నా ఆ ఛాన్స్ సుకుమార్ కేవలం శ్రీలకు మాత్రమే ఇచ్చాడు. అమ్మడు కూడా ఆ నమ్మకాన్ని అంతే నిలబెట్టుకుంది. మాస్ అప్పిరియన్స్ తో కుర్రాకారు హృదయాలు దోచేసింది. కిసిక్ లాంటి పాటలు చేయాలంటే? అది శ్రీలీలతో మాత్రమే సాధ్యమవుతుందని ఒక్క పాటతోనే పాన్ ఇండియాకి చాటి చెప్పింది.
`పుష్ప-2`తో అంతటి సంచలనాన్ని నమోదు చేసింది. అయితే ఆ పాట తర్వాత చాలా మంది తనని ఐటం పాటల్లో నటించమని అడిగారుట. అడిగినంత పారితోషికం చెల్లించడానికి రెడీగా ఉన్నారంది శ్రీలీల. తాను ఎస్ చెప్పాలే గానీ కోట్ల రూపాయలు తన అకౌంట్ లో జమ అవుతాయని తెలిపింది. కానీ వచ్చిన చాలా అవకాశాలు ఇష్టం లేక వదులుకున్నానంది.
కేవలం కొన్ని సినిమాల్లో మాత్రమే అలాంటి పాటల్లో నర్తిస్తానని...డబ్బులిస్తారని ఏ సినిమా పడితే ఆ సినిమాలో అలాంటి పాటల్లో నటించనని తెగేసి చెప్పిందిట. ఐటం పాటల్లో నటించిన తనకంటూ కొన్ని కండీషన్లు ఉన్నాయని...వాటికి లోబడే పని చేస్తాననని తెలిపింది. జాతీయ స్థాయి చిత్రాల్లో నటించాలనే ఆశను వ్యక్తం చేసింది. అలాంటి సినిమా అవకాశాలు వస్తే వదులుకోనని తెలిపింది.
ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా తెలుగు అమ్మాయిగా తనని గుర్తిస్తున్నారంది. ఇతర భాషల్లో అవకాశాలు వచ్చినంత మాత్రాన తెలుగు సినిమాలకు దూరమవుతానని అనుకోవద్దు. తన మొదటి ప్రాధాన్యత తెలుగు సినిమాలకేనని తెలిపింది. తెలుగులో పాటు ఇతర భాషల అవకాశాల్ని బ్యాలెన్స్ చేస్తూ కెరీర్ లో ముందు కెళ్తానని స్పష్టం చేసింది.