శ్రీ‌లీల‌కు మోకాల‌డ్డిన బాలీవుడ్ బంధుప్రీతి?

త‌దుప‌రి ప‌లువురు స్టార్ హీరోలు ఈ అమ్మ‌డికి పిలిచి అవ‌కాశాలిచ్చేందుకు సిద్ధంగా ఉన్నార‌ని క‌థ‌నాలొస్తున్నాయి.

Update: 2024-07-13 09:30 GMT

త‌నదైన అందం.. న‌ట‌న.. డ్యాన్సుల‌తో మైమ‌రిపిస్తోంది యువ‌క‌థానాయిక‌ శ్రీ‌లీల‌. టాలీవుడ్ లో సాయిప‌ల్ల‌వి త‌ర్వాత మ‌ళ్లీ అంత‌టి ఎన‌ర్జిటిక్ డ్యాన్సింగ్ క్వీన్ గా శ్రీ‌లీల‌కు గుర్తింపు ఉంది. కెరీర్ ప్రారంభించిన త‌క్కువ కాలంలోనే అగ్ర‌శ్రేణి క‌థానాయిక‌గా శ్రీ‌లీల టాప్ హీరోల స‌ర‌స‌న న‌టించేసింది. సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌.. మాస్ మ‌హారాజా ర‌వితేజ లాంటి అగ్ర హీరోల సినిమాల్లో అవ‌కాశాలు అందుకుంది. త‌దుప‌రి ప‌లువురు స్టార్ హీరోలు ఈ అమ్మ‌డికి పిలిచి అవ‌కాశాలిచ్చేందుకు సిద్ధంగా ఉన్నార‌ని క‌థ‌నాలొస్తున్నాయి.

అయితే టాలీవుడ్‌లో శ్రీ‌లీల కెరీర్ ఇలా ఉండ‌గానే, త‌దుప‌రి బాలీవుడ్‌లో అడుగు పెట్టేందుకు ఈ బ్యూటీ ప్ర‌య‌త్నిస్తోంది. బాలీవుడ్ యువ‌హీరో వరుణ్ ధావన్‌తో కలిసి ఒక రొమాంటిక్ చిత్రంలో సెకండ్ లీడ్‌గా న‌టించేందుకు అవ‌కాశం అందుకుంద‌ని ఇటీవ‌ల గుస‌గుస‌లు వినిపించాయి. వ‌రుణ్ ధావన్ హిందీ చిత్ర‌సీమ‌లో అద్భుత ప్ర‌తిభావంతుడు. అలాంటి హీరో స‌ర‌స‌న ఆరంగేట్ర‌మే అవ‌కాశం రావ‌డం అంటే అది అదృష్టం. ధావ‌న్ బోయ్ స‌ర‌స‌న స‌మంత‌, కీర్తి సురేష్ లాంటి భామ‌లు అవ‌కాశాలు ద‌క్కించుకున్నారు. ఇలాంటి స‌మ‌యంలో శ్రీ‌లీల‌కు లైన్ క్లియ‌రైతే అది త‌న‌కు క‌లిసొచ్చే అంశం.

కానీ ఇంత‌లోనే ఈ బ్యూటీకి బాలీవుడ్ బంధుప్రీతి మోకాల‌డ్డుతోంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. శ్రీ‌లీల‌కు న‌ట‌వార‌సురాలు అన‌న్య పాండే నుంచి పోటీ ఎదుర‌వుతోంద‌ని స‌మాచారం. సెకండ్ లీడ్ అయినా కానీ ధావ‌న్ బోయ్ స‌ర‌స‌న న‌టించేందుకు అన‌న్య పాండే ప్ర‌య‌త్నిస్తోంద‌ని స‌మాచారం. శ్రీలీల కెరీర్ టాలీవుడ్‌లో ఊపందుకున్నప్పటికీ, బాలీవుడ్ లో స‌రైన‌ సంబంధాలు లేకపోవడం ప్రతికూలంగా మారింద‌ని, అదే స‌మ‌యంలో అనన్యకు పరిశ్రమలో ఉన్న సంబంధాలు ప్ర‌ధాన అస్సెట్ గా క‌లిసి రానున్నాయ‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ గురించి చర్చించడానికి దర్శకుడు డేవిడ్ ధావన్, వరుణ్ ధావన్‌లతో అన‌న్య ఇటీవ‌ల‌ సమావేశమైందని క‌థ‌నాలొస్తున్నాయి. దీంతో శ్రీ‌లీల‌కు ద‌క్కాల్సిన ఆఫ‌ర్ అన‌న్య‌కు వెళ్లిపోతోంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

అన‌న్య పాండే తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుపరిచితురాలు. ఇంత‌కుముందు లైగ‌ర్ చిత్రంలో విజ‌య్ దేవ‌ర‌కొండ స‌ర‌స‌న ఈ బ్యూటీ నటించిన సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్ లో పేరున్న సీనియ‌ర్ న‌టుడు చుంకీ పాండే కుమార్తె అన్న సంగ‌తి అంద‌రికీ తెలుసు. టాలీవుడ్ స్టార్లు స‌మంత‌, కీర్తి సురేష్ కి అవ‌కాశం క‌ల్పించిన వ‌రుణ్ ధావ‌న్ త‌దుప‌రి శ్రీ‌లీల‌కు ఛాన్సిస్తాడా లేదా? అన్న‌ది వేచి చూడాలి. ప్ర‌తిభ‌లో అన‌న్యకు ఏమాత్రం తీసిపోని శ్రీలీల‌కు ఈ అవ‌కాశం ద‌క్కాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు. ఏం జ‌రుగుతుందో వేచి చూడాలి.

Tags:    

Similar News