బెంగుళూరు లో శ్రీలీల ఆసుపత్రి పెడుతుందా?
డాక్టర్ కుటుంబం నుంచి వచ్చి యాక్టరైంది శ్రీలీల. అమ్మడు అమెరికన్ పౌరురాలు. అక్కడే పుట్టి పెరిగింది
డాక్టర్ కుటుంబం నుంచి వచ్చి యాక్టరైంది శ్రీలీల. అమ్మడు అమెరికన్ పౌరురాలు. అక్కడే పుట్టి పెరిగింది. ఆమె తల్లి స్వర్ణలత పేరున్న గైనకాలజిస్ట్. అమెరికాలో స్థిరపడ్డ కుటుంబం. కానీ శ్రీలీల మాత్రం బెంగుళూ రు నుంచి తెరంగేట్రం చేసింది. తొలుత అక్కడ 'కిస్' అనే సినిమాలో నటించింది. అటుపై తెలుగులో 'పెళ్లి సందడి' సినిమాలో ఛాన్స్ అందుకుంది. ఆ తర్వాత అమ్మడి కెరీర్ ఎంతలా పుంజుకుందో తెలిసిందే.
వరుస విజయాలతో తక్కువ సమయంలోనే తెలుగులో స్టార్ హీరోయిన్ గా ప్రమోట్ అయింది. అయితే సినిమాలపై ఎంత ఆసక్తిగా ఉందో? చదువు అన్నా అంతే ఆసక్తి. అందుకే డాక్టర్ కుటుంబం నుంచి వచ్చిన అమ్మడు డాక్టర్ కావాలనుకుంది. ఈ నేపథ్యంలో చదువుని ఎక్కడా అశ్రద్ద చేయలేదు.ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ఎంబీబీఎస్ పూర్తిచేసే పనిలో ఉంది. ప్రస్తుతం ఎంబీబీఎస్ చివరి ఏడాది పరీక్షలకు సన్నదం అవుతుంది.
ఈ నెల 18 నుంచి 24 వరకూ పైనల్ ఇయర్ పరీక్షలు ఉన్నాయిట. ఈ నేపథ్యంలో శ్రీలీల అలజడి టాలీవుడ్ లో ఎక్కడా కనిపించలేదంటున్నారు. ప్రస్తుతం పరీక్షల కోసం ముంబైలో ఉందని...ఆమె తల్లి కూడా ముంబై వచ్చిందని సమాచారం. పరీక్షలకు అవసరమైన సూచనలు...సలహాలు తీసుకుంటూ తుదిగా ఎగ్జామ్ హాల్ కి వెళ్లడానికి రెడీ అవుతోంది. ఆ మధ్య 'భగవంత్ కేసరి' ఆన్ సెట్స్ లో నే అమ్మడు ఎంబీ బీఎస్ పుస్తకాలతో కుస్తీ పట్టిన సంగతి తెలిసిందే.
ఇక ఫైనల్ ఇయర్ పరీక్షలు పూర్తి చేసిన తర్వాత శ్రీలీల తల్లితో కలిసి బెంగుళూరులోనూ సొంతంగా ఆసుపత్రి ప్రారంభించే ఆలోచనలో ఉన్నారుట. అయితే అంతకు ముందే హయ్యర్ స్టడీస్ కి వెళ్లాలా? లేక సినిమాలు కొనసాగిస్తూ ఆసుపత్రి బాధ్యతలు నిర్వర్తించాలా? అన్నది ఇంకా ఆలోచించుకులేదని ఆమె సన్నిహిత వర్గాల నుంచి తెలిసింది. హయ్యర్ స్టడీస్ కోసం అమెరికా... రష్యా వెళ్తే గనుక శ్రీలీల సినిమా కెరీర్ వదులుకోవాల్సిందే.