కమిట్ అయ్యారా? అంటే శ్రీలీల కౌంటర్!
తాజాగా శ్రీలీల ఇన్ స్టా గ్రామ్ లో కాసేపు అభిమానులతో ముచ్చటించింది. అందులో ఓయూజర్ ఆర్ యూ కమిటెడ్ ? అని ఇబ్బందికర ప్రశ్న వేసాడు. దీనికి శ్రీలీల కూల్ గా సమాధానం ఇచ్చింది.
హీరోయిన్లు అంటే సోషల్ మీడియాలో అప్పుడప్పుడు రకరకాల కామెంట్లకు గురికాక తప్పదు. విమర్శలతో పాటు కామెంట్లు వాళ్లను ఎంతగా ఇబ్బంది పెడతాయో! చెప్పాల్సిన పనిలేదు. ఈ విషయంలో చాలా మంది భామలు మౌనంగానే ఉంటారు తప్ప తొందరపడి రిప్లై ఇవ్వరు. ఒకవేళ సమాధానం ఇచ్చినా అది ఎంతో బ్యాలెన్స్ గా ఉంటుంది. ఇక్కడ ఆవేశ పడటం కన్నా తెలివైన సమాధానంతో బయట పడటం అన్నది ఎంతో ఉత్తమం.
తాజాగా శ్రీలీల ఇన్ స్టా గ్రామ్ లో కాసేపు అభిమానులతో ముచ్చటించింది. అందులో ఓయూజర్ ఆర్ యూ కమిటెడ్ ? అని ఇబ్బందికర ప్రశ్న వేసాడు. దీనికి శ్రీలీల కూల్ గా సమాధానం ఇచ్చింది. 'అవును... నేను నా పని విషయంలో కమిటెడ్ గానే ఉన్నాను' అని సమాధానం ఇచ్చింది. ఆ ప్రశ్న ఏ ఉద్దేశంతో అడిగిన వాళ్లకు తెలుసు..సమాధానం ఇచ్చిన వాళ్లకు తెలుసు. కానీ ఇక్కడ శ్రీలీల తెలివైన సమాధానం ఇచ్చి మరోసారి శెభాష్ అనిపించింది.
ఇలాంటి ప్రశ్నలు వేస్తే కొంత మంది ఒక్కసారిగా ఆగ్రహానికి గురవుతారు. చాటింగ్ లోనే నానా రచ్చ జరుగుతుంది. కానీ శ్రీలీల ఆ ఛాన్స్ తీసుకోలేదు. అక్కడితో ఆయూజర్ కి కట్ చెప్పింది. మరోకరు ఈరోజు బిగ్ బాస్ కి వస్తున్నారా? అంటే? దానికి అమ్మడు అవును వస్తున్నాను. 'ఆదికేశవ' సినిమా ప్రమోషన్ కోసం వెళ్తున్నా అంది. మెగా మేనల్లుడువైష్ణవ్ తేజ్ కి జోడీగా శ్రీలీల 'ఆదికేశవ' లో నటించిన సంగతి తెలిసిందే. నవంబర్ 24న సినిమా రిలీజ్ అవుతుంది.
ప్రస్తుతం శ్రీలీల వరుసగా షూటింగ్ లతో బిజీగా ఉంది. 'గుంటూరు కారం'..'ఉస్తాద్ భగత్ సింగ్' తో పాటు మరికొన్ని చిత్రాల్లో నటిస్తోంది. మరి హైదరాబాద్ లో ఉన్న అమ్మడు దివాలీని ఎలా సెలబ్రేట్ చేసుకుం టుంది? అన్న వివరాలు మాత్రం ఇంకా పోస్ట్ చేయలేదు.