శీలీల గ్లామర్.. వారికి అనిల్ రావిపూడి స్ట్రాంగ్ కౌంటర్
మీరు అన్నట్టుగా శ్రీలీల గ్లామర్, డ్యాన్సులు మూవీలో మిస్ అయ్యాయని రివ్యూలు రాసిన వాళ్లు.. ఆమెకు అభిమానులు అయి ఉండొచ్చు.
టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల అంటేనే క్యూటీ గ్లామర్, ఎనర్జిటిక్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ అనే పేరు ఉంది. చాలా మంది సినీ ప్రియులు ఆమె సినిమా అనగానే ఇది ఆశిస్తున్నారు. అయితే తాజాగా రిలీజైన బాలకృష్ణ భగవంత్ కేసరిలోనూ ఇది ఉంటుందేమోనని కొంతమంది ఆశించారు. కానీ అది లేదు. శ్రీలీల పాత్ర కథకు తగ్గట్టు ఎంతో నేచురల్‌గా డీగ్లామర్‌గా ఉంది.
అయితే శ్రీలీల గ్లామర్ ఈ సినిమాలో మిస్ అయ్యిందని కొంతమంది రివ్యూలు రాశారు. దీనిపై ఈ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి సక్సెస్ ప్రెస్ మీట్లో ఓ స్మాల్ స్ట్రాంగ్ కౌంటర్ వేశారు. నేను రివ్యూలను అంతగా పట్టించుకోను. ఎందుకంటే వర్డ్ ఆఫ్ మౌత్ అన్నింటికన్నా పెద్దదని భావిస్తాను. ఆడియెన్స్ నుంచి వచ్చే మాటే ఒక సినిమా భవిష్యత్తును డిసైడ్ చేస్తుంది. చిత్రంలో సెన్సిటివ్ ఎలిమెంట్స్‌ను అర్థం చేసుకుని చాలా మంది పాజిటివ్‌గానే రివ్యూలు ఇచ్చారు.
మీరు అన్నట్టుగా శ్రీలీల గ్లామర్, డ్యాన్సులు మూవీలో మిస్ అయ్యాయని రివ్యూలు రాసిన వాళ్లు.. ఆమెకు అభిమానులు అయి ఉండొచ్చు. వాళ్లు ఆమె నుంచి డ్యాన్సులు చూడాలని కోరుకుని ఉండొచ్చు. సినిమాలో శ్రీలీ పాత్ర ఒక ఫోబియాతో బాధపడే అమ్మాయి. ఆమెను సివంగిలా మార్చాలనుకునే తండ్రి తపన పడే కథ ఇది. మరి ఇందులో వాళ్లు డ్యాన్సులు చూడాలనుకున్నారంటే వారి మానసిక పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు." అని అనిల్ రావిపూడి పేర్కొన్నారు.
ఇకపోతే ఈ చిత్రం విజయంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. భగవంత్ కేసరి.. ప్రమోషన్స్ సమయంలో చెప్పినట్టుగానే.. ఈ చిత్రం షానా ఏండ్లు యాదుంటాది అని మరోసారి అన్నారు. ప్రేక్షకుల నుంచి వస్తోన్న రెస్పాన్స్‌ను చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు.
ఇప్పటివరకూ ఆరు సినిమాలు చేయగా.. ఫిల్మ్ మేకర్‌గా ఈ చిత్రం తనకు పూర్తి సంతృప్తిని ఇచ్చినట్లు తెలిపారు. ఈ చిత్రం గొప్ప విజయాన్ని సాధించడానికి ప్రధాన కారణం ఎమోషన్స్. తండ్రీకుమార్తెల ఎమోషన్‌కు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతున్నారు అని చెప్పారు.