శ్రీలీలా నెవ్వర్ బిఫోర్ లుక్.. హీటెక్కిస్తోందిగా..

ఆ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ శ్రీలీల మంచి పేరు సంపాదించుకుంది.

Update: 2024-07-10 04:42 GMT

యంగ్ హీరోయిన్ శ్రీలీలకు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. స్టార్ హీరోలకు ఏమాత్రం తీసిపోదు అన్నట్లుగా ఫేమ్ ను దక్కించుకుంది అమ్మడు. అచ్చ తెలుగు అమ్మాయి అయినప్పటికీ కన్నడ సినిమాల ద్వారా సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది. అక్కడ శ్రీలీల చేసిన ఫస్ట్ మూవీ కిస్ సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన పెళ్లి సందD మూవీతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది శ్రీలీల.

ఆ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ శ్రీలీల మంచి పేరు సంపాదించుకుంది. ఆ తర్వాత రవితేజ ధమాకా మూవీతో ఒక్కసారి లైమ్ లైట్ లోకి వచ్చేసింది. సెన్సేషనల్ హీరోయిన్ గా మారి.. టాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంది. ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా తొమ్మిది చిత్రాల ఆఫర్లు కొట్టేసింది. కానీ ఆ తర్వాత ఆమె చేసిన సినిమాల్లో నందమూరి బాలకృష్ణ భగవంత్ కేసరి మూవీ తప్ప మిగతా చిత్రాలు అన్నీ మెప్పించలేకపోయాయి.

దీంతో కాస్త స్లో అయిన శ్రీలీల.. ఇప్పుడు మళ్లీ ఫామ్ లోకి వచ్చేసింది. వరుస అవకాశాలు దక్కించుకుని షూటింగ్స్ లో పాల్గొంటోంది. త్వరలో అదర్‌ లాంగ్వేజెస్‌ లోనూ తన మార్క్ చూపించేందుకు రెడీ అవుతోంది. సిల్వర్ స్క్రీన్ పై ఫుల్ బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటోంది శ్రీలీల. ట్రెడిషనల్, మోడ్రన్ అలా అన్ని రకాల ఔట్ ఫిట్స్ లో ఫోటోలు దిగుతూ సందడి చేస్తోంది. వాటిని పోస్ట్ చేస్తూ ఎప్పుడూ ట్రెండింగ్ లోనే ఉంటోంది.

తాజాగా అదిరిపోయే వీడియోను షేర్ చేసింది శ్రీలీల. అందులో ఆమె వేరే లెవెల్ లో ఉంది. అల్ట్రా స్టైలిష్ ఔట్ ఫిట్ లో ఓ రేంజ్ లో సందడి చేసింది. వైట్ కలర్ స్పెషల్ ప్రింటెడ్ షర్ట్, క్రేజీ జీన్ బాటమ్ తో శ్రీలీల ఫారిన్ వీధుల్లో నడుస్తూ కనిపించింది. హెయిర్ లీవ్ చేసుకుని.. ఎంజాయ్ చేస్తూ పోజులిచ్చింది. ఒక్కో పోజులో బ్యూటీ సింప్లీ సూపర్బ్. నవ్వుతూనే తన చూపులతో మాయ చేస్తోంది. బ్యాక్ గ్రౌండ్ లో పెర్ఫెక్ట్ ర్యాప్ సాంగ్ ను యాడ్ చేసింది.

ప్రస్తుతం శ్రీలీల వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారింది. లవ్ అండ్ ఫైర్ సింబల్స్ తో కామెంట్స్ సెక్షన్ నింపేస్తున్నారు నెటిజన్లు. లైకుల వర్షం కురిపిస్తున్నారు. శ్రీలీల అంటేనే అందమని చెబుతున్నారు. అమ్మడు సో గ్లామరస్ అంటూ కొనియాడుతున్నారు. బ్యూటీ థైస్ షోకు క్లీన్ బౌల్డ్ అయ్యామని అంటున్నారు. వెరీ వెరీ బ్యూటిఫుల్ శ్రీలీల అంటూ రచ్చ రచ్చ చేస్తున్నారు. మరి శ్రీలీల అదిరిపోయే వీడియోను మీరు చూశారా?

Tags:    

Similar News