లాభాలు వాళ్ల జేబుల్లోకి..రిజ‌ల్ట్ నా ఖాతాలోకి!

తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో ఈ సినిమా ఫ‌లితం గురించి శ్రీనువైట్ల ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసారు.

Update: 2024-10-06 12:01 GMT

శ్రీనువైట్ల వ‌రుస ప్లాప్ ల్లో ఉన్న స‌మ‌యంలో మాస్ రాజా ర‌వితేజ పిలిచి మ‌రీ అవ‌కాశం ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. అదే `అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ`. కానీ ఈ సినిమా ఆశించిన ఫ‌లితాలు సాధించ‌లేదు. వ‌రుస ప్లాప్ ల‌నుంచి వైట్ల ని ఈ సినిమా బ‌య‌ట ప‌డేస్తుంద‌ని రిలీజ్ కి ముందు చాలా మంది అంచ‌నా వేసారు. కానీ మ‌ళ్లీ హిట్ నే రిపీట్ చేసి మ‌రిన్ని విమ‌ర్శ‌లు ఎదుర్కున్నాడు శ్రీనువైట్ల‌. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో ఈ సినిమా ఫ‌లితం గురించి శ్రీనువైట్ల ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసారు.

`అప్పుడున్న స‌మ‌యంలో ఓ క‌న్ప్యూజ‌న్ తో తీసుకున్న నిర్ణ‌యం అంది. ఆ సినిమా ద్వారా నిర్మాత‌ల‌కు లాభాలొచ్చాయి. కానీ ఈ సినిమా ప్ర‌భావం నామీద ప‌డింది. కేవ‌లం నిర్మాత‌ల్ని ర‌క్షించ‌డం మాత్ర‌మే సినిమా కాదు. ప్రేక్ష‌కుల్ని దృష్టిలో పెట్టుకుని క‌థ విష‌యంలో రాజీ ప‌డ‌కుండా సినిమా చేయాల‌ని అర్ద‌మైంది. ఏది ఏమైనా ప్రేక్ష‌కులు మెచ్చుకునే సినిమా చేయాల‌ని అర్దం చేసుకున్నా` అన్నారు.

అంత‌క‌ముందు శ్రీనువైట్ల మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తో బ్రూస్లీ చిత్రాన్ని తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే. ఇందులో మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ పాత్ర పోషించారు. ఇది కూడా భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అయిన ఈ సినిమా కూడా అంచ‌నాలు అందుకోలేదు. ఈ సినిమా గురించి ఏమంటున్నారంటే?` `బ్రూస్లీ బ‌డ్జెట్ తో పోలిస్తే… వ‌చ్చిన రెవిన్యూ ఎక్కువ‌. నిర్మాత‌లు అన్ని విధాలా లాభాలు తెచ్చుకొన్నారు.

అందులో చాలా సీన్లు బాగా పండాయి. ముఖ్యంగా మెగాస్టార్ రీ ఎంట్రీలా ఈ సినిమా ఉప‌యోగ‌ప‌డింది. చివ‌ర్లో చిరు ఎంట్రీకి మంచి అప్లాప్ వ‌చ్చింది. కానీ మేం ఆశించిన స్థాయిలో సినిమా ఆడ‌లేదు. అలాగ‌ని ఈ సినిమా ఫ్లాప్ సినిమా కాదు` అని అన్నారు. అలా శ్రీనువైట్ల రెండు ప్లాప్ సినిమాల‌పై త‌న వివ‌ర‌ణ ఇచ్చే ప్ర‌య‌త్నం చేసారు.

Tags:    

Similar News