గేమ్ ఛేంజర్ లో శ్రీకాంత్ డాడీ గెటప్ !
తాజాగా శ్రీకాంత్ సినిమాలో ముఖ్యమంత్రి పాత్ర పోషిస్తున్నాడు? అన్న సంగతి బయటకు వచ్చింది. స్వయంగా ఆయనే ఆ పాత్ర గురించి రివీల్ చేసారు.
శంకర్ దర్శకత్వం వహిస్తోన్న ఆర్సీ 15( గేమ్ ఛేంజర్ ) లో చార్మింగ్ స్టార్ శ్రీకాంత్ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ ఆ పాత్ర ఎలాంటిదన్నది రివీల్ కాలేదు. తాజాగా శ్రీకాంత్ సినిమాలో ముఖ్యమంత్రి పాత్ర పోషిస్తున్నాడు? అన్న సంగతి బయటకు వచ్చింది. స్వయంగా ఆయనే ఆ పాత్ర గురించి రివీల్ చేసారు. ఆ సంగతేంటో ఆయన మాటల్లోనే.. ` ఈ పాత్ర ఓ ఎత్తైతే..గెటప్ మరో ఎత్తు. మా నాన్నగారి ఫోటో చూసి డిజైన్ చేసిన పాత్ర అది.
ప్రాస్తెటిక్ మేకప్ కోసమే నాలుగు గంటలు పట్టేది. ఈ తరహా మ్యాకప్ తో నటించడం ఇదే తొలిసారి. గెటప్ వేసిన వెంటనే ఆ పాత్రకి సంబంధించిన హావభావాలు వాటంతటవే వచ్చేవి. హవభావాల కోసం ప్రత్యేకంగా ఎవరిని అనుకురించింది లేదు. కానీ మా నాన్నలా నేను కనిపిస్తానా? నాకు ఆ గెటప్ సెట్ అవుతుందా? అనే అనుమానాలు ఉండేవి. గెటప్ వేసుకుని ఓ రోజు మా ఇంటికి వెళ్లాను. మా అమ్మ నన్ను చూసి ఒక్కసారిగా షాక్ అయింది.
ఆమె చూసాక గెటప్ నాకు ఎంత బాగా కుదిరిందో అర్దమైంది. రామ్ చరణ్ తో కలిసి ఇప్పటికే కొన్ని సినిమాలు చేసాను. ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు. ఇందులో చరణ్ అప్పన్న పాత్రలో చూస్తే ప్రేక్షకులకు షాక్ అవుతారు. ఆ పాత్రలో చాలా కొత్తగా కనిపిస్తాడు. దర్శకుడు శంకర్ తీసిన సినిమాలు సరైన ఫలితాలు సాధించక పోవచ్చు. కానీ దర్శకుడిగా మాత్రం ఆయన ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు. రాజకీయ కోణం ఉన్న ఈ సినిమాని మంచి మలుపులతో చాలా బాగా తీసారు.
ఆయన ప్రతీ సినిమాలాగే ఇందులోనూ బలమైన సామాజిక సందేశం ఉంటుంది` అని అన్నారు. చరణ్ సినిమాలో డ్యూయల్ రోల్ పోషిస్తున్నారు. అప్పన్న అనే రైతు పాత్ర ఒకటైతే... రామ్ నందన్ అనే కలెక్టర్ రోల్ మరొకటి. తండ్రి కొడుకు రోల్స్ అవి అని తెలుస్తోంది.ఈ చిత్రాన్ని దిల్ రాజ్ నిర్మిస్తుండగా , జనవరి 10న చిత్రం రిలీజ్ అవుతుంది.