'పుష్ప 2' సెట్లోకి శ్రీవల్లి రంగ ప్రవేశం
అయితే అంతకుముందే పుష్ప చిత్రంతో రష్మిక బిగ్గెస్ట్ పాన్ ఇండియా హిట్ అందుకుంది.
బాలీవుడ్ లో రష్మిక మందన్న ఆరంగేట్రం ఆశించిన ఫలితాల్ని ఇవ్వలేదు. అమితాబ్ బచ్చన్.. సిద్ధార్థ్ మల్హోత్రా లాంటి స్టార్లతో సినిమాలు చేసినా అవేవీ హిట్లవ్వకపోవడం నిరాశపరిచింది. కానీ ఇప్పుడు రణబీర్ కపూర్‌తో తెలుగు దర్శకుడు సందీప్ వంగా యానిమల్ లాంటి పాన్ ఇండియా హిట్ ని రష్మిక కెరీర్ కి అందించాడు. బాలీవుడ్ లో ఇది బంపర్ హిట్. అయితే అంతకుముందే పుష్ప చిత్రంతో రష్మిక బిగ్గెస్ట్ పాన్ ఇండియా హిట్ అందుకుంది.
ప్రస్తుతం పాన్ ఇండియా లీగ్‌లో రష్మిక కూడా చేరిపోయింది. తదుపరి `పుష్ప 2`తో మరో పాన్ ఇండియా విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. సౌత్ నార్త్ లో అత్యంత అదృష్ట నాయికగా మరోసారి రష్మిక పేరు ట్రెండింగ్ లో ఉంది. `యానిమల్` బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలు కొడుతుండగా, ఇంతలోనే అల్లు అర్జున్‌తో తన బ్లాక్‌బస్టర్ ఫ్రాంచైజీ నుంచి `పుష్ప 2: ది రూల్` షూటింగ్ కోసం డిసెంబర్ 13 నుంచి రష్మిక సెట్లో జాయినవుతుందని తెలిసింది. పుష్ప 2 తన కెరీర్ లో మరో ఉత్తమమైన చిత్రం కాబోతోందని భావిస్తోంది.
యానిమల్ లో తన నటనకు లభిస్తున్న ప్రేమ, ప్రశంసలతో రష్మిక చాలా సంతోషంగా ఉంది. యానిమల్ భారీ విజయాన్ని ఆస్వాధిస్తున్న క్రమంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా `పుష్ప 2` షూటింగ్ ని ప్రారంభిస్తోంది. ఈ చిత్రంలో రష్మిక శ్రీవల్లిగా కనిపించనుంది. అంతేకాదు.. పుష్ప ఫ్రాంచైజీలో మళ్లీ శ్రీవల్లి పాత్రలో రష్మిక మందన్న నటించడం అభిమానులకు ఉత్సాహం నింపుతుందనడంలో సందేహం లేదు. యానిమల్ చిత్రంలో గీతాంజలిగా లేయర్డ్ పాత్రలో అద్భుత నటనతో అభిమానులను ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిత్రంలో రష్మిక నటన, అందం భారతీయ సినిమాకి ఆమె మాత్రమే నేషనల్ క్రష్ అని నిరూపణ అయింది. తదుపరి పుష్ప 2 తో పాటు నాయికాప్రధాన చిత్రం `ది గర్ల్‌ఫ్రెండ్`లో కూడా కనిపించనుంది.