ఫోటో స్టోరి: చెమ‌ట‌లు ప‌ట్టించిన స‌లార్‌-OG న‌టి

తాజాగా శ్రీ‌య‌రెడ్డి స్పెష‌ల్ డిజైన‌ర్ లుక్ లో క‌నిపించింది. ఈ డిజైన‌ర్ డ్రెస్ ప్ర‌త్యేక‌త ఏమిటంటే.. టాప్ టు బాట‌మ్ శ్రీ‌య అంద‌చందాల‌ను అన్ని కోణాల్లో ఎలివేట్ చేయ‌డమే.

Update: 2023-09-19 17:06 GMT

ఆరడుగుల బుల్లెట్టులా క‌నిపిస్తుంది శ్రీ‌య రెడ్డి. యాంక‌ర్ కం న‌టిగా రాణించిన ఈ బ్యూటీ స్టార్ హీరో విశాల్ సోద‌రుడు, డైరెక్ట‌ర్ విక్ర‌మ్ కృష్ణ‌ భార్య‌గా సుప‌రిచితం. ఈ భామ పాపుల‌ర్ భారతీయ క్రికెటర్ భరత్ రెడ్డి వార‌సురాలు. తమిళం- తెలుగు- మలయాళ చిత్ర పరిశ్రమలలో అనేక చిత్రాలలో న‌టించింది. 2002లో సమురాయ్ చిత్రంతో తెరంగేట్రం చేసింది. బ్లాక్ (2004), తిమిరు (2006), కాంచీవరం (2008) చిత్రాలతో పేరు తెచ్చుకుంది. శ్రీయా రెడ్డి నటి కం నిర్మాత. త‌న‌ భర్త విక్రమ్ కృష్ణతో కలిసి సినిమాలను నిర్మించారు. ఈ దంపతులకు ఒక కుమార్తె ఉంది.


శ్రీయా రెడ్డి తన పాఠశాల విద్యను గుడ్ షెపర్డ్ లో పూర్తి చేసి, చెన్నైలోని ఇతిరాజ్ కళాశాల నుండి డిగ్రీని అందుకుంది. ఆ త‌ర్వాత న‌టిగా కెరీర్ ని కొన‌సాగించింది. త‌దుప‌రి ప్ర‌భాస్ స‌లార్ లో ఓ కీల‌క పాత్ర‌ను పోషిస్తున్న శ్రీ‌య రెడ్డి, ప‌వ‌న్ క‌ల్యాణ్ ఓజీలోను ఒక ముఖ్య పాత్ర‌లో క‌నిపించ‌నుంది. స‌లార్ కోసం ప్ర‌శాంత్ నీల్ ఒక స‌రికొత్త ప్ర‌పంచాన్ని సృష్టించార‌ని శ్రీ‌య‌రెడ్డి ఇంత‌కుముందు వెల్ల‌డించారు. ఇందులో హీరో విల‌న్ తో పాటు ఏడెనిమిది పాత్ర‌లు నువ్వా నేనా? అంటూ పోటీప‌డ‌తాయ‌ని కూడా వెల్లడించింది.

స‌లార్ నా కమ్ బ్యాక్ సినిమా. నా శరీరం దృఢంగా ఉంది. నాకు ఒక అద్భుత‌మైన స‌న్నివేశం కూడా ఉంది. ఇంత పెద్ద కాన్వాస్‌పై పనిచేయడం భయపెట్టింది. పునరాగమన పాత్రగా చాలా కఠినమైనది. అయితే ప్రశాంత్ తనకేం కావాలో స్పష్టంగా చెప్పాడు. సురక్షితమైన ఆత్మవిశ్వాసం ఉన్న పురుషుడు మాత్రమే స్త్రీ పాత్ర‌లు చాలా అద్భుతంగా రాయగలడు. నేను గొప్ప నటిని అనే నమ్మకం లేదు. కానీ నాకు ఏది ఇచ్చినా అది 15 నిమిషాల పాత్ర అయినా నేను దానిని సద్వినియోగం చేసుకుంటానని తెలుసు. నేను నిజ జీవితంలో కూడా ఆ పాత్రగా ఉండటానికి ప్రయత్నిస్తాను. అప్పుడే ఆ పాత్ర‌ను తెరపైకి తీసుకురాగలను.నా కెరీర్ బెస్ట్ తిమూరు వచ్చి 16 ఏళ్లు పూర్తయింది. ఇంకా నేను అందులో నటించిన ఈశ్వరి పాత్రను ప్రజలు గుర్తుంచుకుంటారు. అప్పట్లో నెగెటివ్ రోల్ అని పట్టించుకోలేదు. నాకు అది ఒక సవాల్... అందుకే అంద‌రికీ న‌చ్చింది ఆ పాత్ర అని తెలిపింది.

సోష‌ల్ మీడియాల్లో స్పీడ్:

ఇక లుక్ ప‌రంగా ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌యోగాత్మ‌కంగా క‌నిపించేందుకు శ్రీ‌య రెడ్డి ఇష్ట‌ప‌డుతుంది. సోష‌ల్ మీడియాల్లో నిరంత‌రం అభిమానులకు ట‌చ్ లో ఉండే ఈ భామ కొన్ని హాటెస్ట్ ఫోటోషూట్ల‌ను షేర్ చేస్తోంది. తాజాగా శ్రీ‌య‌రెడ్డి స్పెష‌ల్ డిజైన‌ర్ లుక్ లో క‌నిపించింది. ఈ డిజైన‌ర్ డ్రెస్ ప్ర‌త్యేక‌త ఏమిటంటే.. టాప్ టు బాట‌మ్ శ్రీ‌య అంద‌చందాల‌ను అన్ని కోణాల్లో ఎలివేట్ చేయ‌డమే. దీనికోసం మెస్పీ బాట‌మ్ లైన్ దానిపై భాగంలో ఇన్న‌ర్ ని క‌వ‌ర‌ప్ చేసే మెస్సీ డిజైన‌ర్ టాప్ ధ‌రించింది. ఈ ఎంపిక గురి కుదిరింది. ప్ర‌స్తుతం ఈ ఫోటో అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది.

Tags:    

Similar News