మెగా, అనిల్ మూవీకి సంగీత దర్శకుడు ఇతడే!
చిరంజీవి సినిమా కోసం దర్శకుడు అనిల్ రావిపూడి సంగీత దర్శకుడు తమన్‌తో వర్క్ చేయబోతున్నారు.
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర సినిమాను చేస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్‌కి సినిమా విడుదల కాబోతుంది. విశ్వంభర సినిమా పూర్తి కాకుండానే దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో సినిమాను చేయబోతున్నారు. ప్రస్తుతం నానితో ప్యారడైజ్ సినిమాను చేస్తున్న దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఇటీవల చిరంజీవితో సినిమాకు ఒప్పించారు. కథ నచ్చడంతో నాని నిర్మాణంలో చిరంజీవి నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సినిమా గురించి అధికారిక ప్రకటన వచ్చింది.
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో సినిమాతో పాటు అనిల్ రావిపూడి దర్శకత్వంలోనూ సినిమాకు చిరంజీవి ఓకే చెప్పారు. త్వరలోనే సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబో మూవీని షైన్ స్క్రీన్ బ్యానర్‌లో రూపొందబోతుంది. ఈ సినిమా గురించి మరో ఆసక్తికర ప్రచారం ఒకటి జరుగుతోంది. చిరంజీవి సినిమా కోసం దర్శకుడు అనిల్ రావిపూడి సంగీత దర్శకుడు తమన్‌తో వర్క్ చేయబోతున్నారు. సినిమా ప్రకటన సమయంలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించే విధంగా ప్లాన్ చేస్తున్నారు.
చిరంజీవికి గతంలో సంగీతాన్ని అందించి మెప్పించిన తమన్ మరోసారి ఈ సినిమా కోసం వర్క్ చేయబోతున్నారు. అనిల్ రావిపూడి సినిమా అంటే మినిమం గ్యారెంటీ అన్నట్లుగా ఉంటుంది. ఆయన గత చిత్రాల్లో పెద్దగా సంగీతానికి ప్రాముఖ్యత లేదు. అయితే కొన్ని పాటలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. తాజాగా ఆయన సినిమా సంక్రాంతికి వస్తున్నాం నుంచి వచ్చిన గోదారి గట్టు పాటకు సైతం భారీ స్పందన దక్కింది. అందుకే సినిమాలో పాటలకు ఈసారి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలని అనిల్ భావించినట్లుగా సమాచారం అందుతోంది. అందుకే తమన్ తో వర్క్ చేయబోతున్నాడు.
ప్రస్తుతం వరుస సినిమాలతో చాలా బిజీగా ఉన్నాడు. సంక్రాంతికి రామ్ చరణ్ మూవీ గేమ్ ఛేంజర్‌తో రాబోతున్నాడు. ఇప్పటికే వచ్చిన పాటలు బాగున్నాయి. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరి పోతుంది అంటూ మేకర్స్ చెబుతున్నారు. ఓజీ సినిమాకు సైతం తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇంకా పలు చిన్న సినిమాలు పెద్ద సినిమాలు లైన్ లో ఉన్నాయి. ఇంత భారీ స్థాయిలో ఆఫర్లు ఉన్న తమన్‌కి ఇప్పుడు మెగాస్టార్ సినిమాకి సంగీతాన్ని అందించే అవకాశం రావడం కచ్చితంగా చాలా పెద్ద విషయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.