మహేష్ సినిమా మాక్సిమం అక్కడే ప్లాన్ చేస్తున్న రాజమౌళి..!

RRR తర్వాత రాజమౌళి మహేష్ కాంబో సినిమా త్వరలో మొదలు కాబోతుంది.

Update: 2024-09-13 10:30 GMT

RRR తర్వాత రాజమౌళి మహేష్ కాంబో సినిమా త్వరలో మొదలు కాబోతుంది. జక్కన్న సినిమా అంటే ఆ హీరోలంతా సినిమా పూర్తయ్యే వరకు వేరే కమిట్మెంట్ లు ఏమి పెట్టుకోకూడదు. ఐతే మహేష్ రాజమౌళి ఈ కలయికలో రాబోతున్న ఈ సినిమా విషయంలో మేకర్స్ భారీ ప్లానింగ్ లో ఉన్నారు. సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుండగా సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్లే ముందు వర్క్ షాప్ ప్లాన్ చేస్తున్నారు రాజమౌళి.

మహేష్ సినిమా కోసం రాజమౌళి రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్స్ వేయడానికి ప్లాన్ చేస్తున్నారని టాక్. బాహుబలి సినిమా మొత్తం ఆర్.ఎఫ్.సీ లోనే పూర్తి చేశారు. ఇండియాలోనే అతి పెద్ద ఫిల్మ్ స్టూడియో అయిన రామోజీ ఫిల్మ్ సిటీలో ఏ విభాగానికి ఆ విభాగం పర్ఫెక్ట్ గా ఉంటాయి. ఐతే రాజమౌళి బాహుబలి సినిమాకే RFCని ఒక రేంజ్ లో వాడేశారు. తనకు కావాల్సినంత స్పేస్ ఇంకా సెట్స్ ని భారీ డీల్ తోనే అక్కడ వేసేలా ప్లాన్ చేస్తారు.

రామోజీ ఫిల్మ్ సిటీలోనే మహేష్ 29వ సినిమాను ఎక్కువ శాతం షూట్ చేసేలా రాజమౌళి ఆలోచిస్తున్నారట. ఐతే బాహుబలి తర్వాత జక్కన్న చేసిన RRR రామోజీని కాదని బయట చేశాడని టాక్. బాహుబలి సినిమా టైం లో బిజినెస్ లెక్కల్లో వారి మధ్య తేడాలొచ్చాయని చెప్పుకుంటున్నారు. ఐతే రామోజీ రావు కాలం చేశాక ఆయన సంతాప సభకు రాజమౌళి వెళ్లారు. సో దాదాపు R.F.C మేనేజ్మెంట్ తో రాజమౌళి ఇష్యూస్ క్లియర్ అయినట్టే అని చెప్పుకోవచ్చు.

రామోజీ ఫిల్మ్ సిటీలోనే మహేష్ సినిమా గురించి మేజర్ షూటింగ్ అక్కడే వర్క్ షాప్ కూడా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. ఈ సినిమాకు ఫైనల్ కాస్ట్ అండ్ క్రూ ఎవరన్నది త్వరలో ఎనౌన్స్ చేయనున్నారు. రాజమౌళి మహేష్ కాంబినేషన్ సినిమా నెవర్ బిఫోర్ అనే రేంజ్ లో ఉంటుందని తెలుస్తుంది. మహేష్ ఈ సినిమా కోసం తన పూర్తిస్థాయి మేకోవర్ చేస్తున్నాడు. ఇప్పటికే పొడవాటి జుట్టు, గుబురు గడ్డం తో ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేస్తున్నాడు. ఈ సినిమా ప్రొడక్షన్ లో హాలీవుడ్ నిర్మాణ సంస్థ కూడా భాగం అవుతుందని ఫిల్మ్ నగర్ టాక్. అదే జరిగితే మాత్రం ఇది తెలుగు సినిమా పాన్ ఇండియా సినిమా కాదు పాన్ వరల్డ్ సినిమాగా తెరకెక్కుతుందని చెప్పొచ్చు.

Tags:    

Similar News