అగ్ర తారాలు మిస్ అవుతున్న ఆ విషయం.. ఇలా అయితే కష్టమే మరి..
తెలుగులో బాగా క్లిక్ పైన హీరోయిన్లు క్రమంగా పక్క ఇండస్ట్రీకి వెళ్ళిపోతున్నారు. ఇటు తమిళ్, కన్నడ తో పాటు కొందరు నార్త్ లో కూడా బాగా సెటిల్ అవుతున్నారు
తెలుగులో బాగా క్లిక్ పైన హీరోయిన్లు క్రమంగా పక్క ఇండస్ట్రీకి వెళ్ళిపోతున్నారు. ఇటు తమిళ్, కన్నడ తో పాటు కొందరు నార్త్ లో కూడా బాగా సెటిల్ అవుతున్నారు. మరికొంతమంది డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైపోతున్నారు. కానీ అసలు చిక్కు ఆ తర్వాత వచ్చే సినిమాలతో వస్తోంది. ఇల్లు అలుక గానే పండుగ కాదు అన్నట్లు నాన్‌స్టాప్‌గా సినిమాలు చేస్తున్నారే కానీ ఈ హీరోయిన్ల తమ మూవీస్ కు సంబంధించిన ప్రమోషన్స్ పై పెద్దగా శ్రద్ధ చూపించడంలేదు అనిపిస్తోంది.. మరీ ముఖ్యంగా ఇది తెలుగు డబ్బింగ్ చిత్రాలకు వర్తిస్తుంది…
ఈ తరం నాయికలు తమ మూవీస్ మార్కెట్లలోనూ పర్ఫెక్ట్ గా పోట్రే అవుతున్నాయా లేదా అనే విషయాన్నీ అసలు చూసుకోవడంలేదు..దీని డైరక్ట్ ఎఫెక్ట్ మూవీస్ పై భారీగానే పడుతుంది. అయితే ఈ విషయాన్ని బాగా అర్ధం చేసుకున్న ఆలియా భట్ మాత్రం అటు నార్త్..ఇటు సౌత్ లో తన ఇమేజ్ బాగా పెంచుకుంటోంది.. కానీ ఆమెకంటే ముందే ఇండస్ట్రీలో సెటిల్ అయిన అగ్ర తరాలు మాత్రం ఈ విషయంలో వెనుక పడిపోయారు. మరి ఆ లిస్ట్ లో ఉన్న ఆ హీరోయిన్స్ ఎవరో ఓ లుక్ వేద్దాం పదండి..
కీర్తి సురేష్:
తెలుగు లో బాగా క్లిక్ అయిన ఈ మహానటి రీసెంట్‌గా కన్నడలో రఘుతాత మూవీ చేసింది. మంచి కంటెంట్ ఉన్న మూవీ అయినప్పటికీ తెలుగులో ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ కీర్తి బాగా చేసుకోలేకపోయింది. అందుకే ఈ మూవీ ఆశించిన ఫలితాలు అందుకోలేదు.
నయనతార
లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న నయన తార ఇప్పుడు తెలుగులో సినిమాలు పెద్దగా చేయడం లేదు. జవాన్ మూవీ తో బాలివుడ్ లో కూడా తన సత్తా చాటుకున్న నయన తార సినిమాలతో బిజీగా ఉంది. తాజాగా ఆమె నటించిన టెస్ట్ మూవీ ను డైరక్ట్ రిలీజ్ కాకుండా ఓటీటీలోనే విడుదల చేయాలని అనుకుంటున్నారట. అయితే ఈ స్పోర్ట్స్ డ్రామా బాగా ప్రమోట్ చేస్తే తెలుగులో మాంచి కలెక్షన్స్ వచ్చే ఛాన్సుంది.. కానీ ఎందుకో నయన తార ఆ విధంగా ఆలోచించడంలేదు.
సౌత్ లోనే కాదు నార్థ్లో కూడా కొందరు హీరోయిన్స్ ఇదే తప్పు చేస్తున్నారు. తాజాగా కరీనా కపూర్,కృతిసనన్, టబు నటించిన క్రూ విషయంలో కూడా ఇదే జరిగింది. కృతిసనన్ , టబు..ఈ ఇద్దరికీ తెలుగులో మార్కెట్ బాగా ఉన్నపటికీ ఎందుకో ఈ చిత్ర బృందం దాన్ని క్యాష్ చేసుకోలేకపోయారు.