టాప్ స్టోరి: విడాకుల‌తో భార్య‌కు కోట్లు రాసిచ్చిన హీరోలు?!

అయితే కోర్టు తీర్పు మేర‌కు జీవిత భాగస్వామికి భరణంగా భారీ మొత్తం చెల్లించవలసి ఉంటుంది. పిల్లల పోష‌ణ త‌ప్ప‌నిస‌రి

Update: 2024-11-05 03:54 GMT

పాశ్చాత్య సంస్కృతి ప‌ర్య‌వ‌సానం భార‌త‌దేశంలో స్ప‌ష్ఠంగా క‌నిపిస్తోంది. సెల‌బ్రిటీలు, సామాన్యులు అనే తేడా లేకుండా చాలామంది సెల‌బ్రిటీ క‌పుల్స్ విడాకులు తీసుకుంటున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో విడాకులు సర్వసాధారణంగా మారింది. చాలామంది జంటలు ఇప్ప‌టికే విడిపోయారు. అయితే కోర్టు తీర్పు మేర‌కు జీవిత భాగస్వామికి భరణంగా భారీ మొత్తం చెల్లించవలసి ఉంటుంది. పిల్లల పోష‌ణ త‌ప్ప‌నిస‌రి. మలైకా అరోరా - అర్బాజ్ ఖాన్ విడాకుల‌ నుండి హృతిక్ రోషన్ - సుస్సేన్ ఖాన్ వరకు.. బాలీవుడ్ లో అత్యంత ఖరీదైన విడాకుల వివ‌రాల‌ను ప‌రిశీలిస్తే తెలిసిన సంగ‌తులివి.

భార‌త‌దేశంలో అత్యంత ఖ‌రీదైన విడాకులు ఇది. హృతిక్ రోషన్-సుసానే ఖాన్ జంట 2014లో విడిపోయారు. సుస్సానే భరణంగా 380 కోట్లకు ఫైన‌ల్ అయిందని క‌థ‌నాలొచ్చాయి. కానీ హృతిక్ ఈ వార్తలను ఖండించారు. అమీర్ ఖాన్ త‌న భార్య రీనా నుంచి విడిపోయాక 50 కోట్లు భ‌రణంగా చెల్లించుకున్నార‌ని క‌థ‌నాలొచ్చాయి. సైఫ్ అలీ ఖాన్- న‌టి అమృతా సింగ్ జంట 13ఏళ్ల దాంప‌త్య జీవ‌నం త‌ర్వాత విడిపోయారు. ప‌టౌడీ సంస్థాన రాకుమారుడైన సైఫ్ ఖాన్ త‌న మొద‌టి భార్య అమృత‌కు భరణంగా భారీ మొత్తాన్ని చెల్లించాల్సి ఉందని క‌థ‌నాలొచ్చాయి. అయితే ఆ మొత్తం ఎంత అనేది వారు వెల్లడించలేదు. సైఫ్‌ సంపదలో దాదాపు సగం చెల్లించాల్సి ఉంటుంద‌ని గుసగుసలు వినిపించాయి. సైఫ్ త‌న భార్య‌కు రూ.5 కోట్లు భరణం ఇవ్వాలని వార‌సుడు ఇబ్రహీంకు 18 ఏళ్లు వచ్చే వరకు నెలకు 1 లక్ష ఇవ్వాల్సి ఉంటుంద‌ని కోర్టు తీర్పు వెలువ‌రించిన‌ట్టు క‌థ‌నాలొచ్చాయి.

సంజయ్ కపూర్-కరిష్మా కపూర్ విడాకులు కూడా కాస్ట్ లీ ఎఫైర్ గానే ముగిసింది. ఈ జంట‌ ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులు. ఇద్దరూ తమ 13 సంవత్సరాల వివాహ బంధాన్ని ముగించారు. సంజయ్ తండ్రి నివాసం(ఇల్లు)పై హ‌క్కుల‌ను యాజమాన్యాన్ని క‌రిష్మా తన పేరుకు బదిలీ చేయించుకుంది. ఆమె బాండ్ల నుండి నెలవారీ రూ. 10 లక్షల వడ్డీని కూడా అందుకుంటోంది. త‌న‌ పిల్లల పేర్ల మీద 14 కోట్లు డిపాజిట్లు ఉన్నాయి.

మలైకా అరోరా - అర్బాజ్ ఖాన్ బ్రేక‌ప్ గురించి తెలిసిందే. ఈ జంట‌ 13 సంవత్సరాల వైవాహిక జీవితాన్ని గ‌డిపారు. పెళ్లికి ముందు ఇద్దరూ ఐదేళ్ల పాటు డేటింగ్ చేశారు. కానీ అనూహ్యంగా ఈ జంట విడిపోయారు. మలైకా రూ.10 నుంచి 15 కోట్ల మేర భరణం తీసుకుందని ప్ర‌చారమైంది.

నటుడు ద‌ర్శ‌క‌నిర్మాత‌ ఫర్హాన్ అక్తర్- అధునా భబానీ 16 సంవత్సరాల వైవాహిక జీవితానికి ముగింపు ప‌లికారు. 2016 లో ఈ జంట‌ విడిపోయారు. ఫర్హాన్ నెలవారీ భత్యానికి బదులుగా వన్-టైమ్ భరణం మొత్తాన్ని చెల్లించాడు. అధునా 10000 చదరపు అడుగుల భవనం `విపాసన`ను కూడా ద‌క్కించుకుంది. ఫ‌ర్హాన్ ఇటీవ‌ల మ‌రొక న‌టి శిభాని దండేక‌ర్ ని పెళ్లాడిన సంగతి తెలిసిందే.

టాలీవుడ్ లో నాగచైత‌న్య - స‌మంత జంట విడాకులు, భ‌ర‌ణం గురించి చాలా చ‌ర్చ సాగింది. ఈ బ్రేక‌ప్ అనంత‌రం అక్కినేని కుటుంబం నుంచి భారీ మొత్తాన్ని స‌మంత అందుకుంద‌ని గుస‌గుస‌లు వినిపించాయి. అయితే సంపాద‌కురాలైన సామ్ త‌న మాజీ భ‌ర్త‌ చైతూ నుంచి ఏమీ ఆశించ‌లేద‌ని కూడా కొన్ని మీడియాల్లో క‌థ‌నాలొచ్చాయి. కానీ భ‌ర‌ణం వ‌గైరా అంశాల‌పై పూర్తి వివ‌రాలు వెల్ల‌డి కాలేదు.

Tags:    

Similar News