2065 కోట్ల దావా.. హీటెక్కిస్తున్న స్టార్ కపుల్ విడాకులు
స్టార్ కపుల్ ఏంజెలినా జోలీ-బ్రాడ్ పిట్ మధ్య కీచులాటలు విడాకుల ఫర్వం గురించి తెలిసిందే.
స్టార్ కపుల్ ఏంజెలినా జోలీ-బ్రాడ్ పిట్ మధ్య కీచులాటలు విడాకుల ఫర్వం గురించి తెలిసిందే. ఈ ఇద్దరి మధ్యా పిల్లల పెంపకం, ఆస్తుల పంపకంలో ఇప్పటికీ గొడవలు కోర్టుల పరిధిలో కొనసాగుతున్నాయి.
ఏంజెలీనా జోలీ - బ్రాడ్ పిట్ ల నడుమ 2065 కోట్ల(USD 250 మిలియన్ల దావా)కు సంబంధించిన దావాలో ఊహించని సాక్ష్యం వెలుగు చూసింది.
ఫ్రాన్స్‌లోని ఈ దంపతులకు చెందిన `మిరావల్ వైనరీ`కి సంబంధించిన సుదీర్ఘ న్యాయ వివాదంతో ఏంజెలీనా జోలీ, బ్రాడ్ పిట్‌ల సంబంధం దెబ్బతింది. ఒకప్పుడు వ్యక్తిగత స్వర్గధామంగా భావించిన వైనరీ వారి విడాకుల సమయంలో సమస్యాత్మకంగా మారింది. ఇటీవలి కోర్టు రికార్డులు, ప్రాజెక్ట్ నుండి వైదొలగడానికి ఆమె ఎంపిక చేసుకున్న వివరాలను తెలియజేస్తూ, జనవరి 2021లో పిట్‌కి జోలీ పంపిన ప్రైవేట్ ఇమెయిల్‌ను జోలీ ఇప్పుడు పబ్లిక్ చేసింది. ఈ ఈమెయిల్ వారి వ్యక్తిగత వృత్తిపరమైన జీవితాల మధ్య సంబంధాల తీవ్రతను రివీల్ చేసింది.
ఏంజెలీనా జోలీ ఇమెయిల్ లోతులను అన్వేషించడంతో అసలు కథ మొదలైంది. ఏంజెలీనా ఇటీవల తన మాజీకి ఒక లేఖను రాసింది. ``డియర్ బ్రాడ్, నేను భావోద్వేగానికి గురికాకుండా దీన్ని రాతపూర్వకంగా పంపుతున్నాను`` అని ఈ లేఖను ప్రారంభించింది. తన కుటుంబ సంక్షేమం... నైతిక సూత్రాల కంటే ప్రాజెక్ట్ ప్రాధాన్యతను సంతరించుకుందని, తాను దీనిని ఎంత బాధాకరంగా భావిస్తోందో ఇమెయిల్‌లో వివరించింది. మిరావల్- అనేది ప్రత్యేక సందర్భల్లో సన్నిహితులతో సమావేశాలకు అలవాటు పడిన కుటుంబ వ్యాపార స్పాట్. జోలీ దీనిని నిర్వహిస్తోంది. ఈ జంట గతం వల్ల ఆ చోటుకు ప్రాముఖ్యత పెరిగింది. అదే చోట ఈ స్టార్ కపుల్ వివాహం చేసుకున్నారు. వారి కవలలను స్వాగతించారు. అందుకే ఈ స్థలంతో ఆ ఇద్దరి అనుబంధం ఎంతో గొప్పది.
మిరావల్ సామరస్యం శాంతికి మార్గదర్శిగా మారుతుందని యాంజెలీనా మెయిల్ లో సూచించింది. బ్రాడ్ పిట్ తన భార్య జోలీని విడిచిపెట్టాలని కోరుకుంటున్నట్లు జోటీ మెయిల్ వెల్లడిస్తోంది. అతడి ప్రపోజల్ కు యాంజెలినా కూడా అంగీకరించింది. ఇమెయిల్ లో అతడిపై ఫిర్యాదులు బయటపడ్డాయి. ఆమె అభిప్రాయాలు నిర్ణయాలను బ్రాడ్ విస్మరించాడు. దీంతో అవన్నీ తమ బంధంపై గణనీయమైన ప్రతికూల ప్రభావాన్ని చూపిన సందర్భాలను జోలీ మెయిల్ లో వివరించింది. వైనరీ మార్కెటింగ్ ఇమేజరీ గురించి కూడా వారి పిల్లలకు తగనిదిగా జోలీ మాట్లాడింది. వైనరీ సంస్థ ఆస్తుల గురించి గొడవ మానసికంగా ఆ జంటను దూరం చేసింది.
జోలీ తన వాటాను అమ్మేయాలనుకోవడానికి కారణం.. మద్యపానం. తన కుటుంబ కలహాల కారణంగా మద్యంపై దృష్టి సారించే కంపెనీలో పని చేయడం అసౌకర్యానికి గురి చేసింది. అటువంటి సంస్థతో తన సంబంధాన్ని పునరుద్దరించుకోవటానికి జోలీ ఆసక్తిగా లేదు. ఆ కంపెనీలో తన భాగాన్ని కొనుగోలు చేయాలని పిట్ కి ప్రతిపాదించింది. వైనరీకి జోలీ రాజీనామా చేసినప్పటికీ పిట్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ .. భవిష్యత్తులో పిల్లలు దానితో భిన్నమైన సంబంధాన్ని పెంచుకుంటారని ఆమె ఆశాభావం వ్యక్తం చేస్తూ ఇమెయిల్‌ను ముగించారు. ``విచారకరంగా, ఏంజీ`` అని సంతకం చేసిన ఇమెయిల్ తన బాధాకరమైన నిర్ణయాన్ని ఓపెన్ చేసింది.
ఏంజెలీనా జోలీ- బ్రాడ్ పిట్‌ల నడుమ చట్టపరమైన గొడవలతో ఆస్తుల అమ్మకం ప్రారంభమైంది. జోలీ చివరికి వైనరీలోని తన వాటాను రష్యన్ బిలియనీర్ యూరి షెఫ్లర్ టెన్యూట్ డెల్ మోండోకి అక్టోబర్ 2021లో విక్రయించింది. పిట్‌కి దాని గురించి తెలియదు. ఎందుకంటే అతడు మీడియా వార్తల ద్వారా మాత్రమే తెలుసుకున్నాడు. ప్రత్యక్ష సోర్స్ నుండి కాదు. 2008లో వైనరీ ని జాయింట్ గా కొనుగోలు చేసారు. అయితే విభేదాలు వచ్చాయి. పిట్ తరువాత జోలీ అమ్మకం ప్రయత్నాలను నిలిచిపోయేలా దావా వేసాడు. దాని పునఃస్థాపనకు సమ్మతించకుండా విక్రయించకూడదని వారి మునుపటి ఒప్పందం కారణంగా ఇది చట్టవిరుద్ధమని దావాలో పేర్కొన్నారు. జోలీ ప్రతివాదం ఈ ఏర్పాటు ఉనికిని తిరస్కరించింది. ఆర్థిక స్వాతంత్య్రం కోసం ఆమె ఆవశ్యకతను నొక్కి చెప్పింది. ఈ దంపతుల నడుమ ఆస్తి గొడవలు మనశ్శాంతి లేకుండా చేసాయని దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు.