శ్రీలీల MBBS వెనక షాకిచ్చే స్టోరి
తాజా ఇంటర్వ్యూలో శ్రీలీల మాట్లాడుతూ తాను వైద్యుల కుటుంబం నుంచి వచ్చానని తెలిపారు.
టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతోంది శ్రీలీల. ఎనర్జిటిక్ పెర్ఫామెన్సెస్, డ్యాన్సులతో ఈ బ్యూటీ కుర్రకారు గుండెల్లో తిష్ఠ వేసింది. దీంతో వరుసగా అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. తక్కువ కాలంలో ఎక్కువ ఫేం సంపాదించిన భామల్లో శ్రీలీల పేరు చేరింది.
ఇక శ్రీలీల ఎంబీబీఎస్ డాక్టర్ అన్న సంగతి కొద్దిమందికే తెలుసు. ఇప్పుడు శ్రీలీల MBBS అభ్యసించడానికి కారణం తెలిసింది. అసలు డాక్టర్ కాబోయి యాక్టర్ అయిన శ్రీలీల నిజానికి వైద్యం వైపు ఎందుకు వెళ్లింది? దానికి కారణమేమిటి? అంటే వివరాల్లోకి వెళ్లాలి.
తాజా ఇంటర్వ్యూలో శ్రీలీల మాట్లాడుతూ తాను వైద్యుల కుటుంబం నుంచి వచ్చానని తెలిపారు. ''తన తల్లి, సోదరుడు వైద్యులు కావడం తనను ఈ వైద్య వృత్తిని ఎంచుకునేలా చేయలేదని.. దాని వెనుక మరొక కథ ఉంద''ని కూడా తెలిపారు. ''ఒకరోజు నేను మా అమ్మమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఆసుపత్రి దగ్గరలో లేదు. ఆ సౌకర్యం చాలా దూరంలో ఉంది. అమ్మమ్మ అనారోగ్యంతో పడిపోయింది. ఆ సమయంలో డాక్టర్ వచ్చే వరకు నేను ఆమెను రక్షించడానికి ఏమీ చేయలేదు.
ఆ క్షణంలో నేను పనికిరానిదానిని అనుకున్నాను. నేను అప్పటికే మెడిసిన్ ప్రవేశ పరీక్షకు హాజరైనా ఆ సంఘటన నన్ను మార్చింది. వైద్య వృత్తిపై ఉత్తమ అభిరుచి అంకితభావంతో కోర్సును కొనసాగించడానికి ప్రేరేపించింది'' అని శ్రీలీల చెప్పారు. సినిమాల షూటింగ్‌లో విరామంలో ఎమ్‌బిబిఎస్ పాఠాలు ప్రిపేర్ అవుతానని చెప్పింది. షూట్ విరామ సమయంలో ఆసుపత్రికి వెళ్లి కోర్సును ప్రాక్టీస్ చేస్తానని తెలిపింది. శ్రీలీల ఆసుపత్రికి కూడా హాజరవుతుంది.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.. శ్రీలీల నటించిన భగవంత్ కేసరి అక్టోబర్ 19న విడుదల కానుంది. దీంతో ప్రస్తుతం ప్రచారంలో బిజీగా ఉంది. గుంటూరు కారంలో మహేష్ సరసనా శ్రీలీల నటిస్తోంది. ఆదికేశవ, ఎక్స్‌ట్రా తదితర చిత్రాల్లోను శ్రీలీల నటించింది.