టీజర్: ఆ దెయ్యం కథకు మరో సీక్వెల్..

సౌత్ లో అయితే గతంలో ఆర్జీవీ రక్తచరిత్ర మూవీ రెండు భాగాలుగా చేశాడు. అయితే బాహుబలి సిరీస్ తో ఈ సీక్వెల్స్ ట్రెండ్ ఊపందుకుంది.

Update: 2024-06-25 12:42 GMT

ఈ మధ్య సీక్వెల్స్ ట్రెండ్ ఇండియన్ బాక్సాఫీస్ పై బలంగా నడుస్తోంది. ఈ సీక్వెల్ కథలకి ప్రేక్షకాదరణ లభిస్తూ ఉండటంతో దర్శక నిర్మాతలు కూడా తమ హిట్ సినిమాలకి కొనసాగింపుగా పార్ట్ 2, 3 అంటూ చేస్తున్నారు. బాలీవుడ్ లో ఈ సీక్వెల్స్ ట్రెండ్ ఎప్పటి నుంచో ఉంది. సౌత్ లో అయితే గతంలో ఆర్జీవీ రక్తచరిత్ర మూవీ రెండు భాగాలుగా చేశాడు. అయితే బాహుబలి సిరీస్ తో ఈ సీక్వెల్స్ ట్రెండ్ ఊపందుకుంది.

ఇదిలా ఉంటే బాలీవుడ్ శ్రద్ధాకపూర్, రాజ్ కుమార్ రావు లీడ్ రోల్ లో తెరకెక్కిన స్త్రీ మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. 2018లో కామెడీ అండ్ హర్రర్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ మూవీలో ఘోస్ట్ రోల్ లో శ్రద్ధా కపూర్ నటించింది. అమర్ కౌశిక్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది. పంకజ్ త్రిపాఠి, అభిషేక్ బెనర్జీ కీలక పాత్రలలో నటించారు. చిన్న సినిమాగా వచ్చి స్త్రీ మూవీ పెద్ద హిట్ అయ్యింది.

గ్రామీణ ప్రాంతాలలో దెయ్యాలకి భయపడి పూర్వకాలంలో ఓ స్త్రీరేపురా అని ప్రతి ఇంటి గోడపై రాసేవారు. ఇదే కాన్సెప్ట్ తో తీసుకొని స్త్రీ మూవీ చేశారు. ఆరేళ్ళ తర్వాత స్త్రీ మూవీ సీక్వెల్ రాబోతోంది. స్త్రీ 2 టైటిల్ తోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మొదటి చిత్రాన్ని నిర్మించిన మడోక్ ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది ఈ బ్యానర్ లో సూపర్ నేచురల్ యూనివర్స్ క్రియేట్ చేసి అందులో ఒక చిత్రంగా స్త్రీ2ని తీసుకొస్తున్నారు.

Read more!

ఈ సినిమాలో కూడా శ్రద్ధా కపూర్ ఘోస్ట్ రోల్ లో నటిస్తోంది. రాజ్ కుమార్ రావు, అభిషిక్త్ ఖురానా, అభిషేక్ బెనర్జీ అనుకోకుండా ఒక సమస్యలో చిక్కుకుంటారు. వారిని కాపాడటానికి ఘోస్ట్ గా ఉన్న శ్రద్ధా కపూర్ తిరిగి వస్తుందంట. తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ అయ్యింది. కాస్తా కామెడీ టచ్ ఇస్తూనే హర్రర్ ఎలిమెంట్స్ తో భయపెడుతూ టీజర్ ని ప్రెజెంట్ చేశారు.

మొదటి పార్ట్ తరహాలోనే స్త్రీ 2 కూడా అందరికి కనెక్ట్ అవుతుందని భావిస్తున్నారు. ఆగష్టు 15న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకి తీసుకొని రానున్నట్లు టీజర్ లోనే కన్ఫర్మ్ చేశారు. చందేరీ టౌన్ లోకి తిరిగొచ్చిన స్త్రీ ఎలాంటి అలజడి సృష్టించిందో చూడాలంటే ఆగష్టు 15 వరకు వెయిట్ చేయాల్సిందే. శ్రద్దా కపూర్ మరోసారి ఈ చిత్రంతో ఆకట్టుకోవడం ఖాయం అని టీజర్ బట్టి అర్ధమవుతోంది.

Tags:    

Similar News