ఈ ఆరుగురు అసలైన 'జవాన్‌'లు!

ఈ సినిమాలోని ప్రతి ఒక్క యాక్షన్‌ సన్నివేశం కూడా ప్రేక్షకులు కళ్లు పెద్దవి చేసుకుని చూసే విధంగా ఉన్నాయి అనడంలో సందేహం లేదు.

Update: 2023-09-09 02:45 GMT

బాలీవుడ్ బాద్ షా షారుఖ్‌ ఖాన్ మరో భారీ విజయాన్ని జవాన్ తో దక్కించుకున్నాడు. పఠాన్ సినిమా తో వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు దక్కించుకున్న షారుఖ్ ఖాన్‌ జవాన్‌ తో కూడా అదే స్థాయి వసూళ్లు నమోదు చేయడం ఖాయం అంటూ అభిమానులు ధీమాతో ఉన్నారు. ఇక జవాన్ సినిమా భారీ విజయానికి కారణం యాక్షన్‌ సన్నివేశాలు అంటూ రివ్యూవర్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

షారుఖ్ ఖాన్‌ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా ప్రతి ఒక్క సినీ ప్రేక్షకుడికి కూడా జవాన్ యాక్షన్‌ సన్నివేశాలు కన్నుల విందు చేస్తున్నాయి. దాంతో ఈ సినిమా అన్ని చోట్ల కూడా భారీ వసూళ్లు నమోదు చేస్తూ దూసుకు పోతుంది. మొదటి రోజే ఏకంగా రూ.125 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఆ తర్వాత రోజుల్లో కూడా వసూళ్లు ఏమాత్రం తగ్గలేదు. ఇంత భారీ విజయానికి కారణం అయిన యాక్షన్ సన్నివేశాల కొరియోగ్రాఫర్స్ గురించి ప్రస్తుతం చర్చ జరుగుతోంది.

ఈ సినిమాలోని ప్రతి ఒక్క యాక్షన్‌ సన్నివేశం కూడా ప్రేక్షకులు కళ్లు పెద్దవి చేసుకుని చూసే విధంగా ఉన్నాయి అనడంలో సందేహం లేదు. ఈ సినిమాకు ఏకంగా ఆరుగురు యాక్షన్ కొరియోగ్రాఫర్‌ లు వర్క్ చేశారు. హాలీవుడ్ సినిమాలకు సైతం వర్క్ చేసిన స్పిరో రజాటోస్‌, క్రెయిగ్ మాక్రె, యానిక్ బెన్‌, కిచా కఫడ్గీ, సునీల్ రోడ్రిగ్స్, అనల్‌ అరసు లు ఈ సినిమా కు వర్క్ చేశారు.

ఒక హాలీవుడ్‌ మూవీని చూస్తున్న ఫీల్‌ కలిగించడం తో పాటు హీరోయిన్స్ తో కూడా యాక్షన్‌ సన్నివేశాలు చేయించి అబ్బుర పరిచిన ఈ ఆరుగురు నిజమైన జవాన్ లు అంటూ అభిమానులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి షారుఖ్ ఖాన్‌ జవాన్ సినిమా తో ఈ ఆరుగురు పాన్ ఇండియా స్థాయి లో గుర్తింపు దక్కించుకున్నారు.

Tags:    

Similar News