మా నాన్న సూపర్ హీరో.. సుధీర్ బాబు మళ్ళీ కొత్త కొత్తగా..

నవ దళపతి సుదీర్ బాబు తన అభిమానులకు మరో అద్భుతమైన అనుభవాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నాడు.

Update: 2024-09-09 08:12 GMT

నవ దళపతి సుదీర్ బాబు తన అభిమానులకు మరో అద్భుతమైన అనుభవాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఆయన తాజా చిత్రం మా నాన్న సూపర్ హీరో, దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రముఖ వెబ్ సిరీస్ లుజర్ ఫేమ్ అభిలాష్ రెడ్డి కంకర ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. వి సెల్యులాయిడ్స్ బ్యానర్ పై సునీల్ బాలుసు నిర్మిస్తున్న ఈ సినిమాకు CAM ఎంటర్‌టైన్‌మెంట్ సహనిర్మాతలు.


సినిమా ప్రమోషన్స్ ప్రారంభిస్తూ, మేకర్స్ మొదట ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ లో సుదీర్ బాబు సింపుల్ మిడిల్ క్లాస్ కూరగాయలతో నిండిన స్కూటర్ పై ప్రయాణిస్తూ, స్కూల్ పిల్లలకు అభివాదం చేస్తూ కనిపిస్తున్నారు. ఆయన చిరునవ్వు ఈ పోస్టర్ కి ఆకర్షణగా నిలిచింది.

ఈ చిత్రం ఒక తండ్రి కొడుకు ని దృఢంగా కరతలు చేసే కథగా ఉంటుంది. సుదీర్ బాబుకి జోడీగా ఆర్ణ ప్రధాన పాత్రలో నటిస్తుండగా, సాయి చంద్, షాయాజి షిండే, రాజు సుందరం, శశాంక్, ఆమని, అన్నీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ సమీర్ కళ్యాణి, సంగీత దర్శకుడు జే కృష్ణ, ఎడిటర్ అనిల్ కుమార్ పి వంటి ప్రతిభావంతుల టీమ్ ఈ చిత్రానికి సహకరిస్తున్నారు.

రాజు సుందరం ఈ సినిమాలో కీలక పాత్ర పోషించడంతో పాటు కొరియోగ్రాఫర్ గా కూడా పని చేస్తున్నారు. ఈ చిత్రానికి కథను అభిలాష్ రెడ్డి కంకర, ఎమ్మివిఎస్ భరద్వాజ్, శ్రవణ్ మడాల కలిసి రాశారు. మా నాన్న సూపర్ హీరో సినిమా టీజర్ సెప్టెంబర్ 12న విడుదల కానుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాతో సుధీర్ బాబు ఎలాగైనా బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకోవాలి అని అనుకుంటున్నాడు.

కంటెంట్ కూడా అన్ని వర్గాల ఆడియెన్స్ కు కనెక్ట్ అయ్యే విదంగా ఉంటుందట. ప్రతీ కథలో సుధీర్ బాబు చాలా కొత్తగా కనిపిస్తూ ఉంటాడు. ఈ సినిమాలో కూడా అతని పాత్ర వెండితెరపై నెవ్వర్ బిఫోర్ అనేలా ఉంటుందని తెలుస్తోంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ కు బాగా కనెక్ట్ అవుతుందని అంటున్నారు. మరి ఈ సినిమా ఏ స్థాయిలో సక్సెస్ అవుతుందో చూడాలి.

Tags:    

Similar News