సుధీర్ బాబు 'జటాధర'.. మరో క్రేజీ పోస్టర్..

సినిమాలో తన యాక్టింగ్ తో మెప్పించిన సుధీర్ బాబు.. యాక్షన్ సీక్వెన్సుల్లో అదరగొట్టి అలరించారు.

Update: 2024-09-24 10:10 GMT

టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు.. ఇండస్ట్రీలో స్పెషల్ క్రేజ్ సంపాదించుకున్న విషయం తెలిసిందే. సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి వచ్చినా.. తనకంటూ మంచి గుర్తింపు దక్కించుకున్నారు. కమర్షియల్ సినిమాలు చేస్తూనే.. వైవిధ్య కాన్సెప్టులను ఎంచుకుంటూ వరుస చిత్రాల్లో యాక్ట్ చేస్తున్నారు. సినిమా సినిమాకు కొత్తదనం చూపిస్తున్నారు. రీసెంట్ గా హరోం హర మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సినిమాలో తన యాక్టింగ్ తో మెప్పించిన సుధీర్ బాబు.. యాక్షన్ సీక్వెన్సుల్లో అదరగొట్టి అలరించారు.


ఇప్పుడు మా నాన్న సూపర్ హీరో మూవీతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు సుధీర్ బాబు. అభిలాష్ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా.. దసరా కానుకగా అక్టోబర్ 11వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. అయితే సుధీర్ బాబు.. చేతిలో జటాధర మూవీ కూడా ఉన్న విషయం తెలిసిందే. ఫాంటసీ కథాంశంతో వెంకట్ కళ్యాణ్ తెరకెక్కిస్తున్నారు. ప్రేరణ అరోరా, శివిన్ నారంగ్, నిఖిల్ నందా, ఉజ్వల్ ఆనంద్ జటాధర సినిమాకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

ఇప్పటికే జటాధర ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ విడుదల చేయగా.. మంచి రెస్పాన్స్ వచ్చింది. పోస్టర్ లో సుధీర్ బాబు చేతిలో త్రిశూలం పట్టుకుని కనిపించారు. తన సిక్స్ ప్యాక్ తో అలరించారు. సినిమాలో సుధీర్ బాబు పవర్ ఫుల్ గా కనిపించనున్నారని క్లారిటీ వచ్చేసింది. తాజాగా మేకర్స్ మరో అప్డేట్ ఇచ్చారు. సెకెండ్ లుక్ పోస్టర్ ను షేర్ చేశారు. ఇందులో సుధీర్ బాబు.. యమా స్పీడ్ లో బైక్ నడుపుతూ కనిపించారు. రెండు పోస్టర్ల మధ్య పుల్ వేరియేషన్ ఉండగా.. ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.

సోషల్ మీడియాలో ఇప్పుడు జటాధర సెకెండ్ లుక్ పోస్టర్.. వైరల్ గా మారింది. మూవీపై అంచనాలు పెరుగుతున్నాయని సినీ ప్రియులు చెబుతున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. యూనిక్ కాన్సెప్ట్ తో సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా మూవీ రానున్నట్లు సమాచారం. శివుడి అతీత శక్తులతో సుధీర్ బాబు రోల్ ఉంటుందని వినికిడి. బాలీవుడ్ హీరోయిన్.. ఫిమేల్ లీడ్ రోల్ పోషిస్తుందని టాక్ వినిపిస్తోంది. తెలుగు, హిందీ భాషల్లో.. ఇండియన్ ఫిల్మ్ ఖ్యాతిని పెంచేలా జటాధర సినిమా తీస్తున్నారట.

రాబోయే కొన్నేళ్ల పాటు మూవీ అందరికీ గుర్తుండిపోయేలా జటాధర ఉంటుందని మేకర్స్ ఇప్పటికే తెలిపారు. గ్రాండ్ గా రూపొందిస్తున్నారు. వచ్చే ఏడాది రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. మహా శివరాత్రి కానుకగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అందుకు తగ్గ ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. త్వరలో మరిన్ని అప్డేట్స్ ఇవ్వనున్నారని తెలుస్తోంది. మరి సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న సుధీర్ బాబు.. పాన్ ఇండియా రేంజ్ లో రానున్న జటాధరతో ఎలాంటి విజయం సాధిస్తారో వేచి చూడాలి.

Tags:    

Similar News