ఆ యువ హీరో కోసం రెండేళ్లు ఆగాల్సిందేనా?

ట్యాలెంట్ తో పాటు ల‌క్ ఉంటే ఇండ‌స్ట్రీలో తిరుగులేదు. ఇండ‌స్ట్రీలో స‌క్సెస్ అయిన వారంతా అలాంటి వాళ్లే. క‌ష్టం అంద‌రూ ప‌డ‌తారు.

Update: 2024-04-29 07:10 GMT

ట్యాలెంట్ తో పాటు ల‌క్ ఉంటే ఇండ‌స్ట్రీలో తిరుగులేదు. ఇండ‌స్ట్రీలో స‌క్సెస్ అయిన వారంతా అలాంటి వాళ్లే. క‌ష్టం అంద‌రూ ప‌డ‌తారు. కానీ ఆ క‌ష్టానికి అదృష్టం కూడా తోడైతేనే ఏరంగంలోనైనా ముందుకెళ్ల‌గ‌లిగేది. అలాంటి వారి జాబితాలో సుహాస్ కూడా చేరిపోయాడు. ఇత‌డు కూడా ఇండ‌స్ట్రీకి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వ‌చ్చిన వాడు అన్న సంగ‌తి తెలిసిందే. యూ ట్యూబ్ లో షార్ట్ ఫిలింస్ ద్వారా గుర్తింపు రావ‌డంతో అక్క‌డ నుంచి సినిమాల్లోకి వ‌చ్చాడు. అక్క‌డ హీరోల‌కు స్నేహితుడి పాత్ర‌లు పోషించ‌డం అవి క్లిక్ అవ్వ‌డంతో గుర్తింపు రావ‌డం అంతా చాలా వేగంగా జ‌రిగిపోయింది.

ఇదే స‌మ‌యంలో `క‌ల‌ర్ ఫోటో` సినిమాకి జాతీయ అవార్డు కూడా రావ‌డంతో ఆ క్రేజ్ సుహాస్కి అద‌నంగా క‌లిసొచ్చింది. ఇప్పుడు ఏకంగా హీరోగా సినిమాలు చేస్తున్నాడు. పారితోషికంగా బాగానే అందుకుంటున్నాడు. 300 ల‌తో మొద‌లైన ప్ర‌యాణం నేడు కోటికి పైగానే అందుకుంటున్నాడు. ప్ర‌స్తుతం సుహాస్ చేతిలో పుల్ గా సినిమాలున్నాయి. రెండు..మూడు కాదండి. ఏకంగా ఎనిమిది సినిమాలు క‌మిట్ అయిన‌ట్లు తెలుస్తోంది. అన్నీ లాక్ అయిన చిత్రాలే. వాటికి ప్ర‌ణాళిక ప్ర‌కారం డేట్లు కేటాయించ‌డం జ‌రిగింది. అలా చూసుకుంటే రెండేళ్ల వ‌ర‌కూ సుహాస్ డేట్లు దొరికే ప‌రిస్థితి లేద‌ని స‌మాచారం.

ఇప్పుడు అడ్వాన్స్ ఇస్తే రెండేళ్ల వ‌రకూ సినిమా చేసే ప‌రిస్థితి లేదంటున్నారు. ఓటీటీలో కూడా మంచి క్రేజ్ ఉండ‌టంతో అక్క‌డ నుంచి కూడా ఆఫ‌ర్లు వెల్లువ‌లా వ‌చ్చి ప‌డుతున్నాయి. వాట‌న్నింటికి మించి సుహాస్ నిర్మాత‌ల హీరోగా క‌నిపిస్తున్నాడు. అత‌డితో సినిమా అంటే నాలుగైదు కోట్ల‌లో తీసేయోచ్చు. థియేట‌ర్..ఓటీటీ బిజినెస్ చూసుకున్నా ఆ ఫిగ‌ర్ ఈజీగా వ‌చ్చేస్తుంది. కాబ‌ట్టి నిర్మాత పెట్టుబ‌డి సేఫ్. ఆ పై వ‌చ్చేది అంతా లాభ‌మే. ఈ కోణంలో చిన్న నిర్మాత‌లు..కొత్త‌గా వ‌చ్చే నిర్మాతలంతా సుహాస్ వెంట ప‌డుతున్నారు. ప్లీజ్ మాతో ఓ సినిమా చేయండి అన్న స‌న్నివేశం సుహాస్ మార్కెట్ ప‌రిదిలో క‌నిపిస్తుందంటున్నారు.

సుహాస్ కూడా త‌న మార్కెట్ ని మించి ఖ‌ర్చు చేయోద్ద‌ని నిర్మాత‌ల‌కు క‌రాఖండీగా ముందే చెప్పేస్తున్నాడు. అది కూడా చాలా మంది నిర్మాత‌ల‌కు వ్య‌క్తిగ‌తంగా క‌నెక్ట్ అవుతుంది. సాధార‌ణంగా స‌క్సెస్ అయితే చాలా మంది బ‌డ్జెట్ అంత‌కంత‌కు పెంచుకుపోతుంటారు. కానీ సుహాస్ ఆ ఛాన్స్ తీసుకోవ‌డం లేదు. ప‌రిమిత బ‌డ్జెట్ లోకంటెంట్ ఉన్న సినిమా చేసి వ‌సూళ్లు రాబ‌ట్టాలి అన్న‌స్ట్రాట‌జీతో ముందుకెళ్తున్నాడు.

Tags:    

Similar News