సుహాసిని కీ ఆ ఇబ్బందులు తప్పలేదట!
తాజాగా సుహాసిన పాల్గొన్న కార్యక్రమంలో మాట్లాడుతూ.. నేను గతంలో నటించిన సినిమా షూటింగ్ సందర్భంగా ఇబ్బంది ఎదుర్కొన్నాను.
కొత్త హీరోయిన్స్ ను సినిమా ఇండస్ట్రీ వారు ఇష్టానుసారంగా వాడుకునేందుకు చూస్తారు అనే టాక్ ఉంది. కొందరు హీరోయిన్స్ చెబుతున్న విషయాలు.. వారు ఎదుర్కొన్న అనుభవాలు వింటూ ఉంటే నిజంగానే ఇండస్ట్రీలో అలాంటి పరిస్థితి ఉందేమో అన్నట్లుగా అనిపిస్తుంది. హీరోయిన్ గా సుహాసిని కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి ఆసక్తిక విషయాలను వెళ్లడించింది.
తాజాగా సుహాసిన పాల్గొన్న కార్యక్రమంలో మాట్లాడుతూ.. నేను గతంలో నటించిన సినిమా షూటింగ్ సందర్భంగా ఇబ్బంది ఎదుర్కొన్నాను. ఒక సీన్ చిత్రీకరణలో భాగంగా హీరో ఒడిలో కూర్చోవాల్సిందిగా దర్శకుడు నాతో అన్నాడు. నేను అందుకు ఒప్పుకోలేదు. ఇది భారతదేశం.. పరాయి పరుషుడి ఒడిలో ఒక స్త్రీ కూర్చోదు అంటూ ఆ సన్నివేశం చేసేందుకు నిరాకరించాను.
మరో సినిమాలో ఒక సన్నివేశం సందర్భంగా హీరో తిన్న ఐస్ క్రీమ్ ను తీసుకుని తినాలి అన్నారు. అందుకు నేను ఒప్పుకోలేదు. అవతలి వ్యక్తి ఎవరు అయినా కూడా నేను ఒకరి ఎంగిలిని తినను. అసలు ఆ ఐస్ క్రీమ్ కూడా ముట్టుకోను అంటూ తెగేసి చెప్పడంతో అక్కడే ఉన్న కొరియోగ్రాఫర్ షాక్ అయ్యాడు అంటూ సుహాసిని పేర్కొన్నారు.
నాకు మాత్రమే కాకుండా నా స్నేహితురాలు శోభన కూడా ఇలాంటి అనుభవాలను ఎదుర్కొన్నారు. ఒక సినిమా షూటింగ్ సమయంలో శోభనకు నచ్చని సన్నివేశం చేయించేందుకు బలవంతం చేశారట.
అప్పుడు శోభన సినిమా నుంచి అయినా తప్పుకుంటాను కానీ నేను ఆ సన్నివేశం చేయను అనేసిందట. దాంతో దర్శకుడు నువ్వేమైనా సుహాసిని అనుకుంటున్నావా అన్నాడట. ఆ విషయాన్ని శోభన నాతో చెప్పింది. హీరోయిన్స్ స్ట్రాంగ్ గా ఉండాల్సిన అవసరం ఉందన్నట్లుగా సుహాసిని పేర్కొంది.